నల్గొండ

ఎండలు ప్రాణాంతకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పిట్టల్లా రాలుతున్న జనం
* యాదాద్రి జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు దుర్మరణం
మోత్కూర్, ఏప్రిల్ 23: మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన గాలి నర్సయ్య (29) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సయ్య ఎడ్ల బండిపై ఇసుకను తరలిస్తూ జీవనం గడిపే వాడని, రోజువారీ పనులు చేస్తుండగా అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వృద్ధురాలి మృతి
బీబీనగర్ : మండలంలోని గొల్లగూడెం గ్రామంలో సోమవారం కూలిపనికోసం వెళ్లిన యాదమ్మ(65) మృతిచెందినట్లు సర్పంచ్ జిట్ట పద్మమల్లారెడ్డి తెలియజేసారు. యాదమ్మ కుటుంభాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

చామాపురంలో వడగళ్ల వర్ష బీభత్సం
* రైతన్నకు తీవ్ర నష్టం
ఆత్మకూర్(యం), ఏప్రిల్ 23: మండలంలోని చామాపురం గ్రామంలో ఆదివారం రాత్రి వడగళ్ల వాన కురవడంతో చేతికొచ్చిన పంట నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చామాపురంతో పాటు పరిసర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వరి పంటలతో పాటు మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్ధితిలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే విధంగా గ్రామాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా కూలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.