నల్గొండ

పునరావాస గ్రామాల్లో ఆలయాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 25: జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కనుమరుగవుతున్న వివిధ దేవాలయాలు, వివిధ ప్రార్ధనాలయాలను పునరావాస గ్రామాల్లో నిర్మించేందుకు రూ.31.12 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో పునరావాస గ్రామాల్లో దేవాలయాల నిర్మాణంపై దేవాదాయ, పులిచింతల, సంబంధితశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో 108 ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈపధకం కింద నిర్మించే దేవాలయాలు, మసీదులు, చర్చిలను పటిష్టంగా పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్, దేవాదాయశాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం రూ.31.12కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చీల నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చినట్లు తెలిపారు. పంచాయితీరాజ్, ఆర్ అండ్‌బీశాఖల వారు సంయుక్తంగా నిర్మాణాలు చేపట్టి గుత్తేదారులకు నెలరోజుల్లో బిల్లులు విడుదలచేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పనులను పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. దేవాలయాల నిర్మాణాల పనులు చేపట్టే కాంట్రాక్టర్‌లు నిర్మాణాలకు వాడే మెటిరియల్ దగ్గర నిలబడి ఫోటోలో దిగి జిల్లా కలెక్టర్‌కు పంపాలని కోరారు. ఒప్పందం పూర్తిచేసుకొని ఈ ఎండీ చెల్లించి 90రోజుల్లో పనిప్రారంభించని కాంట్రాక్టర్‌లను గుర్తించి వారికి నోటిసులు జారీ చేసి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీ
జిల్లాలోని అన్ని పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్‌లు అందించి సూర్యాపేటను నూరు శాతం గ్యాస్ ఉన్న జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పేద మహిళలకు ఉజ్వల్ యోజన పధకం కింద గ్యాస్ కనెక్షన్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 75వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్‌లు లేవని వారందరికి కనెక్షన్‌లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పేదలకు ఈపధకం కింద ఉచితంగా గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఇంకా వంట చెరకు వాడటం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని అంతే కాకుండా మహిళల ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నందున వాటిని నివారించేందుకు గ్యాస్ కనెక్షన్‌లను ప్రభుత్వాలు ఇస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరునే అన్ని సంక్షేమ పధకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పధకాలు నేడు దేశానికే స్పూర్తినిస్తున్నాయని చెప్పారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, గ్రంధాలయసంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్, ఆర్డీవో మోహన్‌రావు, డీఎస్‌వో అనురాధ తదితరులు పాల్గొన్నారు.