నల్గొండ

దేశానికి దిక్సూచిలా కేసీఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 25: ఉద్యమపార్టీగా జలదృశ్యం వేదికగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఆ తర్వాత ప్రజల నమ్మకంతో అధికారం చేపట్టి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పదికాలను అమలుచేస్తూ నేడు దేశానికే దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పార్టీ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్లీనరీ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుండి మొదలుకొని 16 ఏళ్ల ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లు, సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. 2001లో తెలంగాణా రాష్ట్ర సాధనే ఏకైక ఏజెండాగా కేసీఆర్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిశ్రాంతంగా శ్రమించారని అన్ని వర్గాల ప్రజల్లోకి తెలంగాణా వాదాన్ని స్ఫురింపజేసి మలిదశ ఉద్యమంతో చుక్క రక్తమైనా చిందించకుండా అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి చూపిన గొప్ప నాయకుడని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీను ఒప్పించడంతో పాటు తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన టీడీపీ లాంటి పార్టీలను కూడా అనుకూలంగా మార్చిన గొప్ప వ్యూహకర్త అని కీర్తించారు. లక్ష్యసాధనలో భాగంగా అనేక కుట్రలు, కుతంత్రాలను, రాజకీయ ఎత్తుగడలను చిత్తుచేశారన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమై ఆమరణ దీక్షకు పూనుకోవడంతోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రకటన తర్వాత ఆంధ్ర నాయకులు చేసిన కుట్రలను ఎండగట్టి అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి 2014లో రాష్ట్రాన్ని సాధించిన తీరు కేసీఆర్ రాజకీయ చతురత, వ్యూహరచనకు ఆలంబనంగా నిలుస్తుందన్నారు. అప్పటి దాక ఉద్యమ పార్టీగా కొనసాగి ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసే లక్ష్యంతో రాజకీయ పార్టీగా నిలిచి ప్రజల మద్దతుతో అధికారం చేపట్టినట్లు తెలిపారు. మూడేళ్లలోనే అన్నివర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు పదేళ్లుదాటినా విభజన సమస్యలతోనే సతమతం కాగా తెలంగాణలో కేసీఆర్ వాటిని అధిగమించి మూడేళ్లలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా పరిపాలన కొనసాగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారన్నారు. నేడు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న కొంపెల్లిలో నిర్వహించే ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దేశరాజకీయాలను ప్రభావితం చేయబోయే విధాన నిర్ణయాలను ప్రకటించనున్నట్టు తెలిపారు. దేశంలో అత్యధికంగా 50లక్షల సభ్యత్వాలు కలిగిన పార్టీగా టీఆర్‌ఎస్ ఘనత వహించినట్లు చెప్పారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఈనెల 27న నిర్వహించే ప్లీనరీకి పరిమితంగా ప్రతినిధులను ఆహ్వానిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని అందువల్ల ఆహ్వానం రాని వారు అన్యధా భావించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాధోడ్, రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వర్లు, ఏర్నేని బాబు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికలు పాల్గొన్నారు.

నీటిఎద్దడి నివారిస్తాం
*ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు, ఏప్రిల్ 25: వేసవిలో గ్రామాల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను, నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతుందని, వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే మండల పరిధిలోని దోనిపాముల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు, చండూరు నుండి తుమ్మలపల్లి వరకు చేపట్టే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా అంగడిపేట గ్రామంలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తోకల వెంకన్న, జడ్పీటీసీ అనె్నపర్తి సంతోష శేఖర్, పీఏసీయస్ చైర్మన్ బొబ్బలి శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో శైలజ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌యస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.