నల్గొండ

నీటిఎద్దడి నివారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూరు, ఏప్రిల్ 25: వేసవిలో గ్రామాల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను, నీటిపారుదల ప్రాజెక్టులను చేపడుతుందని, వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే మండల పరిధిలోని దోనిపాముల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు, చండూరు నుండి తుమ్మలపల్లి వరకు చేపట్టే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా అంగడిపేట గ్రామంలో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తోకల వెంకన్న, జడ్పీటీసీ అనె్నపర్తి సంతోష శేఖర్, పీఏసీయస్ చైర్మన్ బొబ్బలి శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో శైలజ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌యస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

‘రాబోయే ఎన్నికల తర్వాత
ప్రతిపక్షాల పరిస్థితి సున్నా’
మఠంపల్లి, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నీషలు కృషి చేస్తున్నారని దాని ఫలితాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. దానిలో భాగంగానే నిరంతర విద్యుత్, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరధ ద్వారా ప్రతి గ్రామానికి నీరు అందిస్తున్నామన్నారు. దీంతో 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మల్లీ ఘనవిజయం సాధిస్తుందని అప్పుడు ప్రతిపక్షాలకు పోరాడడానికి ఏమి ఉండదని అన్నారు. బుధవారం సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎకరానికి 4వేలుతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, పెన్షన్లను అందచేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. డిల్లీ నుండి కాశ్మీర్ వరకు ఏ ప్రభుత్వమైన తాము ప్రవేశపెడుతున్న పథకాలను మెచ్చుకుంటున్నాయని అన్నారు.