నల్గొండ

కాలువ మరమ్మతులు పూర్తిచేసి సాగునీరందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మే 6: నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధర్మారెడ్డిపల్లి కాలువ మరమ్మత్తులను త్వరితగతిన పూర్తిచేసి రైతాంగానికి సాగునీటినందించాలని కోరుతూ మండల ఎంపిపి, జెడ్పీటీసిలతో పాటు పలు మండలాల ఎంపిపిలు, రైతులు శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతాంగానికి సాగునీటినందించేటటువంటి ప్రధానమైన సాగునీటి కాలువ ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా సాగునీరందింనట్లయితే నియోజకవర్గంలోని రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రస్తుతం కాలువ ప్రాంతాల్లో మరమ్మత్తులు జరుగుతున్నాయని ప్రభుత్వం రూ. 2.5కోట్లు మంజూరు చేసిందన్నారు. మరమ్మత్తులకు టెండర్లు నేటికి ఖరారుకానందున మరమ్మత్తులు జరగకపోవడంతో సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాలువ ప్రాంతాల్లో పంటల విరామం ప్రకటించబడిందని, మరమ్మత్తులకు టెండర్లను త్వరితగతిన పూర్తిచేసి సత్వరం పనులను పూర్తిచేయించి రైతాంగానికి సాగునీటినందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి పంటలను సాగుచేసుకోలేక రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నదని రైతుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కాలువ మరమ్మత్తులకు సంబంధించిన టెండర్లను సత్వరమే పూర్తిచేసి రైతాంగానికి సాగునీటినందించేందుకు చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో చిట్యాల, నార్కట్‌పల్లి, రామన్నపేట ఎంపిపిలు బట్టు అరుణఅయిలేష్, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, కక్కిరేణి ఎల్లమ్మవిజయ్, తెరాస మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, నాయకులు బట్టు అయిలేష్ పాల్గొన్నారు.