నల్గొండ

కర్నాటకలో పంతాలకుపోయ పరువుపోగొట్టుకున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మే 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పధకం కింద పంట పెట్టుబడి 4,000 రూపాయలు భూమి ఎక్కడుందో తెలియని వారికి కూడ చేసిందని రాష్ట్ర సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. శనివారం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా బైక్ ర్యాలీగా వెళ్లి ఈదులగూడలోని సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ రైతుబంధు పధకం కింద అసలు కష్టపడి పని చేస్తున్న రైతుకు ఎలాంటి సహాయం అందడం లేదన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుబంధు పధకం పంట కాకుండా ఎన్నికల పెట్టుబడిగా ఇస్తున్నారని ఆరోపించారు. దివాలా కోరు విధానాల వల్ల ఎన్నికల్లో డబ్బు పని చేస్తున్నదన్నారు. డబ్బు ఎవరు ఎంత పెడ్తారని ప్రజలు ఆలోచించవద్దని, ఎవరు ప్రజల సమస్యలు తెలుసుకుంటారో, ప్రజల కోసం పని చేస్తారో వారిని ఎన్నుకోవాలని ఆలోచించాలని కోరారు. పుచ్చలపల్లి సుందరయ్య భూస్వామి అని ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై తనకున్న భూమిని కూడ వదులుకున్నారని, వివాహం చేసుకున్న కూడా సంతానం లేకుండా ఆపరేషన్ చేయించుకున్న మహానుభావుడన్నారు. దేశంలోనే మచ్చలేని నాయకుడు సుందరయ్య అని పేర్కొన్నారు. సుందరయ్య ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీ.మల్లేష్, వీ.వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి ఎన్.జగదీష్‌చంద్ర, సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి మహ్మద్‌బిన్‌సయిద్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గౌతంరెడ్డి, టీ.రామ్మూర్తి, పీ.సత్యనారాయణరావు, వీ.బంగారయ్య, దేశ్రాంనాయక్, పీ.రామ్మూర్తి, గాదె పద్మ, ఉర్మిళ, బీబమ్మ, డీవైఏఫ్‌ఐ, ఎస్‌ఏఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఏం.రవినాయక్, కే.శంకర్, అంజద్‌లు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాల కోసం నిరసన ప్రదర్శన
నేరేడుచర్ల, మే 19: మండల కేంద్రమైన నేరేడుచర్లలో సర్వే నెం.206, 226, 231, 243, 244, 250, 252,450లలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇళ్ల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని శనివారం ఇండ్ల స్థలాల పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక ప్రధాన కూడలి వద్ద జరిగిన సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ నేరేడుచర్లలో రెండు నెలల నుంచి ఇళ్ల స్థలాల సాధన కోసం పోరాటం జరుగుతుందని, ఒకవైపు ప్రభుత్వమే ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల్లు నిర్మిస్తామని చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉండగా పంపిణీకి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. అసలు ప్రభుత్వ స్థలం ఉన్నదాలేదా వెంటనే స్పష్టం చేయాలన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, డివిజన్ కార్యదర్శి రాము, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐఎఫ్‌పీయు జిల్లా అధ్యక్షుడు కామెళ్ల నవీన్, ఆదూరి కోటయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.