నల్గొండ

చౌటుప్పల్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 19: చౌటుప్పల్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టిందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో శనివారం రైతుబంధు పథకం చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జేసీ రవినాయక్‌లతో కలిసి రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ ప్రాంత రైతులకు బంగారు భవిష్యత్తు రానుందన్నారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుందని చెప్పారు. అందుకోసం ప్రభుత్వ నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ వస్తుందన్నారు. రైతులు తొందరపడి వ్యవసాయ భూములను అమ్ముకోవద్దని సూచించారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే ప్రాజెక్టులను ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందన్నారు. రైతులు సాగు చేసేందుకు అప్పులు చేసి తిప్పలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి పథకానికి శ్రీకారం చుట్టి ఎకరాకు నాలుగు వేలు ఉచితంగా అందిస్తుందన్నారు. పెట్టుబడి డబ్బులను సద్వినియోగం చేసుకోని సాగును పెంచుకోని ఆర్ధికపరిపుష్టి సాధించాలని కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వినూత్న పథకాలు దేశానికే ఆదర్శమవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని గుర్తుచేశారు. చౌటుప్పల్ - నాగిరెడ్డిపల్లి వరకు అతి త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు మాట్లాడుతూ పల్లెల్లో రైతుబంధు జాతర జరుగుతుందన్నారు. రైతు కళ్లల్లో ఆనందం చేసేందుకు ముఖ్యమంత్రి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు.
రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆర్డీవో సూరజ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ ఎలకరాజు అండాలు, మార్కెట్ వైస్ చైర్మన్ చిరందాసు ధనుంజయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొత్త పర్వతాలు, జిల్లా సభ్యులు చింతల దామోదర్‌రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్, గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశంగౌడ్, ఎండి.ఖలీల్, ఎం.డి.బాబాషరఫ్, వీరమళ్ల సత్తయ్య, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిఆర్.రాము తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో విజయోత్సాహం
అడ్డగూడూర్, మే 19: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయభేరి మోగించిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షులు సతీష్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, గోవర్ధన్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో..
భువనగిరి : కర్ణాటక రాష్ట్రంలో మెజార్టీ లేకున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బలనిరూపణ చేసుకోలేక యెడ్యూరప్ప రాజీనామా చేయడం కాంగ్రెస్, జేడీయస్ పార్టీల నైతిక విజయమని భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, స్వామివివేకానందా విగ్రహాం వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేపట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును గౌరవించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పాలన కొనసాగించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భువనగిరి పట్టణ పార్టీ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్, భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడమ బాలక్రిష్ణ, సేవాదళ్ జిల్లా చైర్మన్ పిట్టల బాలరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోతంశెట్టి మంజుల, నాయకులు బర్రె నరేష్, డాకూరి నిరంజన్, కైరంకొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.