క్రైమ్/లీగల్

నెత్తురోడిన రోడ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, మే 19: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మండలకేంద్రమైన కట్టంగూర్ శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కలిమెర గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కుంచం శంకర్(37) గ్రామంలో తనకు ఉన్న డోజర్ వాహనానికి డిజిల్ తెచ్చేందుకు ద్విచక్ర వాహనంపై తన అన్న కుమారుడు కుంచం మనోజ్ (13)ను వెంట తీసుకొని కట్టంగూర్‌కు వచ్చి డిజీల్ తీసుకొని తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపుకు వెళ్తున్న టాటా ఎఎస్ వాహనం ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో శంకర్, మనోజ్‌లు అక్కడిక్కడే దుర్మరణం చెందగా టాటాఎఎస్ వాహనంలో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఒకరైన శంకర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మనోజ్ కట్టంగూర్‌లోని ఓప్రైవేటు పాఠశాలలో ఆరవ తరగతి పూర్తిచేశాడు. మృతదేహాలకు నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు.

సాగర్‌మార్గంలో ఇద్దరు మృతి
పెద్దవూర : పెద్దవూర మండల పరిధిలోని నాగార్జునసాగర్-హైద్రాబాద్ ప్రధాన రహదారిపై గల తుమ్మచెట్టు ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ (30), నాగరాజు(29) మోటార్‌సైకిల్‌పై వెళ్తు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పెద్దవూర ఏస్‌ఐ రాజు తెలిపారు.