నల్గొండ

యాదాద్రి కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 19: పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ్మస్వామి వారి ఆలయంలో శనివారం నిత్యారాధనలు, భక్తుల అర్జిత సేవలు, పలు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి మంగళహారతి ఇచ్చారు. బిందె తీర్థంతో నిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రతిష్టామూర్తులకు ఆరాధన నిర్వహించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చన చేశారు. వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో అర్చించి ఆరాధించారు. ఆలయంలో వేదపండితుల, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామి అమ్మవార్ల ఎదుట సుదర్శన నారసింహ్మ హోమం నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి ముందుగా స్వామి అమ్మవార్లను అలంకరించిన గజవాహనంపై అధిష్టింపజేసి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అష్టోత్తరం, సహస్రనామార్చన, కల్యాణ మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల వెండి ఉత్సవాన్ని నిర్వహించారు.ఆలయ ఆదాయం రూ.18లక్షల 5,467 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
- ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్‌రావు..
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ్మస్వామి క్షేత్ర పునః నిర్మాణ అభివృద్ధి పనులను శనివారం వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి, ఈఈ దయాకర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులకు సూచించారు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయదశమి నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నామని తెలిపారు.