నల్గొండ

నల్లగొండ, సూర్యాపేట కలెక్టర్లకు ఎక్స్‌లెన్సీ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఎక్సలెన్సి-2018అవార్డులకు నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, సూర్యాపేట కలెక్టర్ కె.సురేంద్రమోహన్‌లు ఎంపికయ్యారు. నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుకు సంబంధించి భూరికార్డుల శుద్ధీకరణ సమర్ధవంతంగా నిర్వహించినందుకు, అలాగే వైద్య, ఆరోగ్యశాఖ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు రెండు విభాగాల్లో ఎక్స్‌లెన్సి అవార్డులు ప్రకటించారు. సూర్యాపేట కలెక్టర్ కె.సురేంద్రమోహన్‌ను కెసిఆర్ కిట్ సమర్ధవంత అమలుకు సంబంధించి ఎక్సలెన్సి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ జిల్లాల కలెక్టర్లకు ఎక్స్‌లెన్సి అవార్డులు రావడం పట్ల ఆయా జిల్లాల అధికారులు, సిబ్బంది హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

చివరి భూములకూ సాగునీరు
అన్ని చెరువులూ నింపాలి * గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి చర్యలు
* అధికారులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశం
సూర్యాపేట, మే 19: జిల్లా పరిధిలోని నాగార్జున్‌సాగర్ ప్రాజెక్టు కింద చివరి భూమలు వరకు సాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్ని గ్రామాల్లో చెర్వులను నింపి ప్రతి ఎకరాభూమి సాగులోకి వచ్చే విధంగా ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో ఎనె్నస్పీ, నీటిపారుదలశాఖ అధికారులతో ఐదుగంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాపరిధిలోని ఆయకట్టు, నీటి లభ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో చెర్వులన్నీ నీటితో కళకలలాడే విధంగా అవసరమైన వరకు కాలువలు ఏర్పాటుచేయాలని సూచించారు. నీరు వృదా కాకుండా గొలుసుకట్టు చెర్వులు నిర్మించాలని, చెర్వులకు నీరుపారే కాలువలు పూడిపోకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొయిన్‌కెనాల్ డీ -8, 9 కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి రిపేర్లు రాకుండా ఈకాలువ పరిధిలో ఉన్న 28వేల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 28వ కిలోమీటర్ తర్వాత గల 8వేల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ఎత్తిపోతల పధకాన్ని నిర్మించేందుకు ప్రతిపాధనలు రూపొందించాలని కోరారు. అదేవిధంగా డీ-8, 9 అనుబంధ కాలువలపై కిందిస్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు లింక్ ఏర్పాటు చేయాలన్నారు. ఎఎమ్పార్పీ కాలువ డీ -14, 15 కింద వరకు నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డీ-37 కెనాల్ పరిధిలో ధర్మాపురం వద్ద తూము ఏర్పాటుచేసి నూనెవారికుంట, నాగులచెర్వు, రెడ్డిచెర్వు, మామిడాలకుంటతో పాటు పరిసర గ్రామాల పరిధిలో ఉన్న చెర్వులన్నీంటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. మేడారం చెర్వుకు నీరు అందించేందుకు మోతె మండలం నామవరం నుండి శ్రీరాంసాగర్ రెండోదశ నుండి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలువల నిర్మాణ పనులు చేపట్టే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని నిధులు వృదాకాకుండా చూడాలన్నారు. ఈసమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, జేసీ సంజీవరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, నీటిపారుదలశాఖ ఛీఫ్ ఇంజనీర్ సునిల్, ఎస్ ఈ నర్సింహ, హమీద్‌ఖాన్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలి
మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తిచేసి సాధ్యమైనంత త్వరలో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాకలెక్టర్ సురేంద్రమోహన్‌తో కలిసి మిషన్ భగీరదపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెలఖరులోగా ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి పంప్‌హౌజ్ ద్వారా సూర్యాపేట పట్టణంతో పాటు చివ్వెంల, పెన్‌పహాడ్, గరిడేపల్లి మండలాల గ్రామాలక రక్షిత మంచినీటిని అందించాలన్నారు. అధికారులు రాత్రింబవళ్లు పనిచేసిన లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. భగీరధ పనులను అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో చేపట్టి పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపుల నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఇంటింటికి నల్లాలు బిగించే పనులను పూర్తిచేయాలన్నారు. ఉండ్రుగొండ గుట్టపై నిర్మింస్తున్న డబ్ల్యూటీపీ పనులను వేగంగా పూర్తిచేసేందుకు అధనంగా కూలీలను ఏర్పాటుచేయాలన్నారు.