నల్గొండ

రైతుబంధు చెక్కును వాపస్ చేసిన రైతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, మే 22: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకంలో భాగంగా పంపిణీ చేసిన పెట్టుబడి సాయం చెక్కును తిరిగి ప్రభుత్వానికి చెక్కును సమర్పించిన రైతు నరోత్తమరెడ్డిని పలువురు ప్రశంసించారు. మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన శీలం నరోత్తమరెడ్డి తనకున్న 7.32 ఎకాలకు గానూ రూ.31,200ల చెక్కును తన తోటి పేద రైతుల సంక్షేమం కోసం రైతుబంధు చెక్కును ప్రభుత్వానికి తిరిగి అందజేస్తున్నట్లు రైతు తెలిపారు. ఈసందర్భంగా రైతు చెక్కును మంగళవారం అధికారులకు అందజేశాడు. ఈకార్యక్రమంలో వ్యవసాయాధికారి రామలింగేశ్వరరావు, ఆర్‌ఐ శ్యాంనాయక్, వీఆర్‌వోల సంఘం మండల అధ్యక్షుడు రామస్వామి, వీఆర్‌వో గిరి, ఏఈఓ ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
భూదాన్‌పోచంపల్లి, మే 22: మండలకేంద్రానికి చెందిన బాత్క సత్తయ్య (55) అనే గొర్రెల కాపరి ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి సోమవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె
గుర్రంపోడ్, మే 22: తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 22 నుంచి జూన్ 3వరకు గ్రామీణ ఢాక్ సేవక్ ఉద్యోగులు మంగళవారం సమ్మెను ప్రారంభిస్తున్నట్లు జీడి ఎస్ డివిజన్ కార్యదర్శి రాజు అన్నారు. మండలకేంద్రంలోని తపాల కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న తపాలాశాఖ ఉద్యోగులను కేంద్రం పట్టించుకోకపోవడంతో చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. తపాలా ఉద్యోగులు రవీంద్రాచారి, నీలయ్య, రవీందర్, ఈశ్వర్, రామలింగయ్య, బుచ్చిరాములు, తదితరులు పాల్గొన్నారు.