నల్గొండ

ఖరీఫ్ ప్రణాళిక ఖరారులో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 22: వ్యవసాయ శాఖ యంత్రాగం రైతుబంధు పథకం అమలులో నిమగ్నమవ్వడంతో ఇప్పటికే ఖరారు కావాల్సిన ఖరీఫ్ సాగు ప్రణాళిక ఖరారులో జాప్యం సాగుతుంది. అసలే రైతుబంధు పథకం ద్వారా పంటకు ఎకరాకు నాలుగువేల పెట్టుబడి సహాయం అందడం, నిరంతర ఉచిత విద్యుత్‌ల పుణ్యిమా అని ఈ దఫా పంట సాగు విస్తీర్ణంతో పాటు విత్తనాలు, ఎరువుల డిమాండ్ భారీగా పెరుగనున్న నేపధ్యంలో తక్షణమే ప్రభుత్వం ఖరీఫ్ వ్యవసాయ, రుణ ప్రణాళిక ఖరారుపై దృష్టి పెట్టాలన్న వాదన సర్వత్రా వినిపిస్తుంది. అయితే ఈ దిశగా నేటికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుండి కూడా ఇంకా జిల్లా వ్యవసాయ అధికారులకు ఎలాంటి ఆదేశాలు అందకపోవడం చర్చనీయాంశమైంది. ఇందుకు కమిషనరేట్ కార్యాలయం నుండి ఏఈవో వరకు కూడా అంతా రైతుబంధు పథకంలో నిమగ్నమవ్వడమే కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
పొంచి ఉన్న విత్తన, ఎరువుల, రుణ సమస్యలు !
రైతుబంధు పథకం, నిరంతర విద్యుత్ నేపధ్యంలో పెరుగనున్న సాగువిస్తీర్ణంకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ సాగించని పక్షంలో రైతుల నుండి నిరసనలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత అంచనాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 5లక్షల 92వేల ఎకరాల మేరకు ఉంటుందని వ్యవసాయ అధికారులు భావిస్తు తదనుగుణంగా విత్తన, ఎరువుల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం పత్తి విత్తనాలు మినహాయిస్తే వరి, కంది, అముదం తదితర పంటలకు 51,671క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అవసరమని అంఛనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 2లక్షల 51,440, యాదాద్రి భువనగిరిలో 1లక్ష 51,763ఎకరాలు, సూర్యాపేటలో 1లక్ష 89,315ఎకరాల్లో పంటల సాగు అంచనాగా ఉంది. నల్లగొండ జిల్లాలో 18,367క్వింటాళ్లు, సూర్యాపేటలో 23,951క్వింటాళ్లు, యాదధ్రి భువనగిరిలో 9వేల క్వింటాళ్ల మేరకు సబ్సిడీ విత్తనాలు అవసరమని అంచనా వేస్తున్నారు. అలాగే ఆయా జిల్లాలకు 3లక్షల క్వింటాళ్ల వివిధ రకాల ఎరువులు అవసరమని అధికార యంత్రాంగం అంచనాలుగా ఉన్నాయి. సదరు అంచనాలన్ని గత ఏడాది ఖరీఫ్ దృష్టిలో పెట్టుకుని రూపొందించున్నవే కావడంతో ఈ ఏడాది అంచనాలపై సవరణలు అనివార్యంగా కనిపిస్తుంది. ఈ దఫా పంట పెట్టుబడి సహాయం, నిరంతర విద్యుత్ నేపధ్యంలో పెరుగనున్న సాగు విస్తీర్ణం దృష్ట్యా పంట సాగు విస్తీర్ణం, విత్తనాలు, ఎరువుల అంఛనాల లెక్కల్లో కనీసం 10శాతమైన పెంపుదల అనివార్యంగా చేయాల్సిందేనన్న వాదన రైతు సంఘాల నుండి వినిపిస్తుంది. రెండో విడత పెట్టుబడి పథకం సహాయం కోసం విధిగా రైతులు పంటల సాగుకు ఉపక్రమించిన పక్షంలో విత్తన, ఎరువుల డిమాండ్ పెరుగడం ఖాయమంటున్నారు.
వార్షిక రుణప్రణాళిక అమోదంలోనూ జాప్యం
మరోవైపు ఇప్పటికే ఖరారు కావాల్సిన 2018-19వార్షిక పంట రుణ ప్రణాళికకు నేటికి ఆమోదం లేకపోవడం మరో సమస్యగా తయారైంది. ఇలాగైతే రైతులకు సకాలంలో రుణ పంపిణీ జరుగడంలో జాప్యం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతుంది. బ్యాంకర్లు సైతం రైతుబంధు పథకం అమలులో తంటాలు పడుతున్నారు. దీంతో జిల్లా బ్యాంకర్ల సమావేశం వాయిదా పడుతు వస్తుంది. గత ఏడాది ఖరీఫ్‌లో 1544కోట్ల రుణ పంపిణి లక్ష్యంగా పెట్టుకుని 1663కోట్లు పంపిణీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు లీడ్ బ్యాంక్ రూపొందించిన లెక్కల మేరకు ఈ ఖరీఫ్‌లో 1253.93కోట్ల రుణాలు, వచ్చే రబీలో 835.95కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా వార్షిక రుణ ప్రణాళిక అంచనాలు రూపొందించారు. రైతుబంధు పథకం నేపధ్యంలో ఈ అంచనాల్లో సైతం సవరణలు తప్పదన్న వాదన వినిపిస్తుంది.

బీసీ ఓటర్ల గణన ముమ్మరం

వలిగొండ, మే 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకై సమయత్తం అవుతుండగా అందులో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో బిసీ ఓటర్ల గణన ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఓటర్ల తుది జాబితా పూర్తి కావడంతో తదుపరి ప్రక్రియయైన బిసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడం జరిగింది. మండల కేంద్రంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ముల్కలపల్లి నాగరాజు, తుల్జా ప్రసాద్, తుమ్మల ఆనంద్ తదితరులు ఉన్నారు.