క్రైమ్/లీగల్

తెప్ప తిరగబడి మత్స్య కార్మికుని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, జూన్ 28: చేపల వేటకు చెరువులోకి వెళ్లిన మత్స్యకార్మికుడు తెప్ప తిరగబడటంతో మృతిచెందిన సంఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామస్థులు, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శాలిగౌరారం గ్రామ పంచాయతీ పరిధిలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు చింతకాయల లింగస్వామి(32) సాటి మత్స్యకారులతో కలిసి తెల్లవారుజామున చేపలవేట కోసం శాలిగౌరారం ప్రాజెక్టులోకి వెళ్లాడు. తోటివారు ఉదయం ఏడున్నర ప్రాంతంలో తిరిగి రాగా లింగస్వామి రాలేదు. దీంతో మత్స్యకారులు చెరువులో వలవేసిన ప్రాంతానికి వెళ్లి చూడగా తెప్ప తిరగబడి కనిపించింది. దీంతో మత్స్యకారులు గాలించగా తెప్ప తిరగబడిన ప్రాంతంలో లింగస్వామి వలలో చిక్కుకొని మృతిచెంది ఉన్నాడు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టమ్ నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు. కాగా ఇదే చెరువులో గత మూడేళ్ల క్రితం లింగస్వామి తండ్రి యాదయ్య ఇదే తరహాలో మృతిచెందడం ఆ కుటుంబాన్ని మరోమారు శోకసంద్రంలో ముంచింది. కాగా, వీరి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహయం అందించి మృతిని కుటుంబానికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి మామిడి రమేష్ డిమాండ్ చేశారు.

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
సూర్యాపేట, జూన్ 28: ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన గురువారం జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నెహ్రూనగర్‌లోని బండల బజార్‌లో నివాసముండే ఆర్టీసీ ఉద్యోగి అరుణ్‌కుమార్ కుమార్తె జ్యోష్నకు ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామానికి చెందిన పెరికపల్లి సురేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఉజ్వల్‌కుమార్ (3) కుమారుడు ఉన్నాడు. సురేష్ ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి కాగా, జ్యోష్న ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. వారంతా అరుణ్‌కుమార్ ఇంటిలోనే కలిసి ఉంటున్నారు. కాగా గురువారం తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగాలకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో బాలునితో పాటు తాతా అమ్మమ్మలు నిద్రించారు. మధ్యలో లేచిన బాలుడు ఉజ్వల్‌కుమార్ మూత్రవిసర్జనకు బయటకు వచ్చి నిద్రమత్తులో నీటిసంపులో పడిపోయాడు. ఆ తర్వాత కొంత సేపటికి నిద్రలేచిన అరుణ్‌కుమార్ దంపతులు మనమడు కన్పించకపోవడాన్ని గమనించి వెతకగా ఇంటి ముందు ఉన్న నీటిసంపులో శవమై కన్పించాడు. దీంతో కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఆడిపాడిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ గొర్రెల పట్టివేత
పెద్దఅడిశర్లపల్లి, జూన్ 28: రాష్ట్ర ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కోసం రాయితీపై అందించిన గొర్రెలను అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుండగా గుడిపల్లి పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామపంచాయతీలో గల వైదోనివంపు గ్రామానికి చెందిన 264 రాయితీ గొర్రెలు, నాలుగు బొలేరో వాహనాలను ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని మల్లాపురం గ్రామ శివారులో ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది పట్టుకున్నారు. ఈ గొర్రెలను గుడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తహశీల్దార్ అంబేద్కర్ సమక్షంలో వైద్యాధికారులు గొర్రెలను పరిశీలించి రాయితీ గొర్రెలుగా నిర్ధారించి వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొర్రెలను పరిశీలించిన వారిలో నల్లగొండ ఏడీ రాజకొండారెడ్డి, నాగార్జునసాగర్ వైద్యాధికారి నాగార్జున్‌రెడ్డి, సిబ్బంది జనార్దన్, తదితరులు ఉన్నారు.