నల్గొండ

బొట్టుబొట్టు ఒడిసిపడితేనే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 10: జీవకోటికి ప్రాణాధారమైన జలాన్ని భవిష్యత్ తరాల వారి కోసం పరిరక్షించుకునేందుకు బొట్టుబొట్టును ఒడిసిపట్టాలని, నీటిని సంరక్షించుకోకపోతే జలసంక్షోభం ఎదుర్కొక తప్పదని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నీటిసంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా నీటియాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నేచర్స్ వాయిస్ సోషల్ మీడియా సహకారంతో జిల్లాలోనే తొలిసారిగా మంగళవారం పట్టణంలో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన జలం-మనం సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానవ నాగరికత నది పరివాహక ప్రాంతాల్లోనే ప్రారంభమైందని గుర్తుచేశారు. అలాంటి వెలకట్టలేని జలాన్ని పరిరక్షించుకుంటునే మానవ నాగరికత మనుగడలో ఉంటుందన్నారు. మానవ ఆవాసాలు ఏర్పడింది నీటి పరివాహక ప్రాంతాల వద్ద అన్న విషయాన్ని నేటి సమాజం గుర్తించాలని కోరారు. విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికి జలం ఉండడం వల్లే భూమండలంపై మానవులతో పాటు సకల జీవులు మనుగడ సాధిస్తున్నాయన్నారు. నీటికోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైందని, అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం నీటి కోసం యుద్దాలు చేసిన చరిత్ర మనకు తెలిసిందేనన్నారు. మానవతప్పిదాల వల్ల అంతరించిపోతున్న నీటిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నీటిసంరక్షణపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమంలా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరీ చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా భూగర్భజలాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి గ్రామీణప్రాంతాల్లోని అన్ని సాగునీటి వనరులను అభివృద్ది చేస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. మిషన్‌కాకతీయ, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతూ ప్రపంచంలోనే అత్యున్నత నీటి యాజమాన్య పద్దతులు అనుసరిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రఖ్యాతి పొందుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు నీటి సంరక్షణపై అవగాహన పెంచుకొని గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేసి తద్వారా నీటిని సంరక్షించుకోవాలని కోరారు. ఇటీవల మహారాష్టల్రోని సుప్రసిద్ద షిరిడిక్షేత్రానికి వచ్చే భక్తులు తమ వెంట నీటిని తీసుకురావాలని ట్రస్ట్‌బోర్డు వారు ప్రకటనలు చేశారని, మనం కూడా మేల్కొని నీటి సంరక్షణకు నడుం బిగించకపోతే అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అందువల్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను భాగస్వామ్యులను చేసి నీటి సంరక్షణకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. స్వచ్చమైన తాగునీటి కోసం 30 ఎళ్ల క్రితమే సూర్యాపేటలో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసుకోవల్సి వచ్చిందని గుర్తుచేశారు. డబ్బును ఎలా పొదుపు చేసుకుంటామో జలాన్ని అదే రీతిన దాచుకోవాలన్నదే ఇంకుడు గుంతల ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యుడు పూల రవీందర్ మాట్లాడుతూ జలసంరక్షణను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకెళ్లే లక్ష్యంతో మంత్రి జగదీశ్‌రెడ్డి చేపట్టిన జలం-మనం కార్యక్రమం అభినందనీయమన్నారు. మానవాళికి పెరుగనిది భూమి అని తరిగిపోయేది జలం అని అందువల్ల జలాన్ని పరిరక్షించుకుంటేనే జనం మానుగడ సాధించగలుతారన్నారు. జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ ఉద్యమంలో ప్రజాప్రతినిధులు స్వచ్చందగా పాల్గొని ప్రజలను చైతన్యం చేసి లక్ష్యాన్ని నేరవేర్చాలని కోరారు. ప్రభత్వాలు ఏ కార్యక్రమాలు చేపట్టిన ప్రజాప్రతినిధుల సహాకారం ఉంటేనే అధికారులు, ప్రజలు ఉత్సాహంగా ముందుకు సాగుతారన్నారు. 90శాతం వర్షపు నీరు వృథా అవుతుందని దానిని మళ్లించి వినియోగించుకునేలా చేస్తే నీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, అధనపు జెసి వెంకట్రావ్, ప్రకృతి కవి గోరెటి వెంకన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, నేచర్స్ వాయిస్ సోషల్ మీడియా ఎడిటర్ క్రాంతికుమార్, నాబార్డ్ మాజీ సిజిఎం మోహనయ్య, సేవ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజయ్‌రావు, నీటి పారుదల నిపుణులు శ్యాంసుందర్‌రెడ్డి, చంద్రవౌలి, గోపాల్, సత్యభూపాల్‌రెడ్డి, దీపక్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఉర్రూతలూగించిన గోరటి, రసమయి
జలం-మనం సదస్సులో పాల్గొన్న ప్రకృతి కవి గోరటి వెంకన్న, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్‌లు నీటి సంరక్షణపై ఆలపించిన పాటలు సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులను ఉర్రుతలూగించాయి. గోరటి వెంకన్న నీటి ప్రాముఖ్యతను తెలియజేప్తు ఆలపించిన ‘విశ్వరమనీయాల..విశ్వజలచక్రం’ గీతం సభికులను ఆకట్టుకుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరిస్తూ పాడిన పాట ఉత్తేజాన్ని నింపింది. రసమయి బాలకిషన్ సైతం జలసంరక్షణ, ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ పథకాలపై పాడిన పాట మంత్రముగ్దుల్ని చేసింది.
8 గంటల పాటు సదస్సులో ఉన్న మంత్రి
నీటిసంరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేప్పే లక్ష్యంతో మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో పట్టణంలో నిర్వహించిన జలం-మనం సదస్సు ఏకంగా 8గంటలపాటు కొనసాగింది. మంత్రి ప్రారంభం నుండి ముగింపు వరకు సదస్సులోనే ఉన్నారు. మంత్రి 8గంటల పాటు సదస్సులో ఉండడంతో జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం సదస్సు ముగిసే వరకు ఉండాల్సి వచ్చింది. సదస్సు ముగింపులో జల సంరక్షణపై మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.