నల్గొండ

బైపాస్ రోడ్డుకు కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట,జనవరి 2:రాయగిరినుండి యాదగిరిగుట్ట వరకు నిర్మాణం చేపట్టిన రోడ్డును, గుండ్లపల్లి శివారునుండి తులసి కాటేజి వరకు నిర్మించతల పెట్టిన బైపాస్ రోడ్డుకు కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అదికారులు ప్రతిపాదించిన గుండ్లపల్లి గ్రామం వెనుక వైపునుండి నల్లచెరువు శిఖం మీదుగా తులసి కాటేజి వరకు అదికారులు ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు స్ధలాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2.3కిలోమీటర్ల మేర 150 పీట్ల వెడల్పుతో 4లైన్ల రోడ్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రూట్ మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. అదే విదంగా బైపాస్ ప్రతిపాదిత స్ధలాన్ని గత రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహెందర్ రెడ్డి పరిశీలించారు. యాదగిరిగుట్టకు చేరుకునే అన్ని రహదార్లను 4లైన్ల రోడ్డుగా అభివృద్ద్ధి పర్చాలని ముఖ్యమంత్రి కేసి ఆర్ ఇప్పటికే అధికార్లను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్ అండ్‌బి అధికారులు గుండ్లపల్లి పాత పెట్రోల్ బంక్ నుండి తులసికాటేజ్ వరకు సర్వే నిర్వహించి 70శాతం ప్రభుత్వభూమి లో గుండా కొద్ది శాతం మాత్రమే ప్రయివేటు భూముల గుండా వెళ్లే విధంగా సర్వే నిర్వహించి రూట్ మ్యాప్‌ను తయారు చేశారు. ఇక కలెక్టర్ ఆదేశంతో బైపాస్ రోడ్ పనులు వేగం పుంజుకోనున్నాయి. కలెక్టర్ బైపాస్ రోడ్డును పరిశీలించిన సమయంలో ఆర్ అండ్‌బి ఎస్‌సి మోహన్‌నాయక్, భువనగిరి ఆర్‌డి ఓ మధుసూధన్, భువనగిరి ఆర్‌అండ్‌బి డిఈ వెంకటేశ్వర్లు, గుట్ట తహశిల్దార్ రామక్రిష్ణ తదితరులు న్నారు.