క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూలై 13: జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుండి చెన్నైకు ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న ఎంపీ 06హెచ్‌సి 4519 నెంబరు గల లారీ వేగంగా వచ్చి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నల్లగొండ టౌ టౌన్ సీఐ ఎండి.బాషా తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం అయిటిపాముల పైపుల కంపెనీ యజమాని ఉప్పలంచి రమేష్ (50) స్థానిక పానగల్లు చౌరస్తా పెట్రోల్ బంకుకు వెళ్లి తన బైకులో పెట్రోల్ పోసుకొని నల్లగొండకు వస్తుండగా అదే సమయంలో చెన్నై వెళ్తున్న లారీ చౌరస్తాలో బైకును ఢీకొట్టింది. దీంతో బైకు లారీ వెనక చక్రాల కింద పడింది. లారీ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో డివైడర్ దాటి మరోవైపు లారీ బైకును ఈడ్చుకెళ్లగా, అదే సమయంలో బిచ్చమెత్తుకొని జీవించే పానగల్లుకు చెందిన వృద్ధుడు కస్పరాజు నర్సింహ (75) డివైడరుపై చెట్ల నీడన నిద్రపోయాడు. దీంతో ఇద్దరూ లారీ కింద పడి నుజ్జునుజ్జయ్యారు. కనీసం శరీర ఆనవాళ్లు సైతం గుర్తుపట్ట లేకుండా ఛిద్రమయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి లారీ డ్రైవర్, లోడుతో ఉన్న లారీని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు రమేష్ స్వస్థలం వలిగొండ మండలం గొల్నేపల్లి, ఇతనికి ఇద్దరు కుమారులు ఉండగా, మరో మృతుడు నర్సింహ బంధువులు పానగల్లులో జీవిస్తున్నారు. మరణవార్త తెలుసుకున్న మృతుల బంధువులు, గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. ఇకనైనా జీఎమ్మార్ నిర్వాహకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.