నల్గొండ

ప్రియుడి కోసం సెల్‌టవర్ ఎక్కిన ప్రియురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, జూలై 13: ప్రేమించిన వ్యక్తి వివాహం చేసుకునేందుకు ముఖం చాటేయడంతో జీవితంపై విర్తకితో ఆ ప్రియురాలు సెల్‌టవర్ ఎక్కడంతో మండల కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్లితే మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ ప్రేమించి మోసం చేశాడని భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి తనను వివాహం చేసుకోవాలని కోరుతూ భాస్కర్ ఇంటి ముందు గత నాలుగు రోజుల నుండి దీక్ష చేస్తోంది. ఈ క్రమంలో గురువారం భాస్కర్‌ను పిలిచి పోలీసులు కౌనె్సలింగ్ ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది. దీంతో తనకు న్యాయం జరగడం లేదని, జీవితంపై విరక్తి చెందిన జ్యోతి శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర సినిమా థియేటర్ వెనక ఉన్న సెల్‌టవర్ ఎక్కింది. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. ఇదే సమయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఒక్కసారిగా రెండు పరిణామాలు చోటుచేసుకోవడంతో విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్‌ఐ ఇద్రీస్ అలీ తన సిబ్బందితో కలిసి జ్యోతి ఎక్కిన సెల్‌టవర్ వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా విషయాన్ని చౌటుప్పల్ ఏసీపీకి, ఆర్డీవోకి, సమీపంలో పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న వారంతా రాస్తారోకో వద్దకు వచ్చి నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం అఖిలపక్షం నాయకులతో కలిసి సెల్‌టవర్ వద్దకు చేరుకొని చౌటుప్పల్ ఏసీపీ రమేశ్, రామన్నపేట సీఐ శ్రీనివాస్, చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్‌లు, అఖిలపక్షం నేతులు దాదాపు 5 గంటల పాటు నచ్చజెప్పారు. అదేవిధంగా సంస్థాన్‌నారాయణపూర్, వలిగొండ ఎస్‌ఐలు మల్లీశ్వరీ, ఇద్రీస్ అలీలు ప్రేమికులిద్దరికి వివాహం జరిపిస్తామని పత్రం రాసి ఇచ్చారు. అనంతరం జ్యోతి టవర్ దిగడంతో ఉత్కంఠకు తెరపడింది. సెల్‌టవర్ దిగిన అనంతరం జ్యోతి విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అండదండలు భాస్కర్ కుటుంబానికి ఉన్నాయని, అందుకే న్యాయం జరగడం లేదని ఆరోపించింది. అనంతరం జ్యోతిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కలిసి పనిచేస్తాం..
పార్టీని గెలిపించుకుంటాం
- అధిష్ఠానం ఆదేశిస్తే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటా..
- పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి
భువనగిరి, జూలై 13: కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి తనను అధిష్ఠానం ఆదేశిస్తే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని ఏఐసీసీ సభ్యులు, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో గూడూరు నారాయణరెడ్డి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించేందుకు గ్రూపులకు అతీతీతంగా కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 16 ఏళ్లుగా తాను చేసిన సేవకు గుర్తింపుగా అధిష్ఠానం ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్త పరిచారు. విద్యార్థి దశ నుండి ఎన్‌ఎస్‌యూఐ రాజకీయాలలో చురుకుగా పనిచేస్తు సిటీ ఎన్‌ఎస్‌యూఐ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, వివిధ రాష్ట్రాలలో పరిశీలకునిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ స్థాయిలో పార్టీకి సేవలందించానని గుర్తుచేవారు. గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించినా అధిష్ఠానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బరిలో దించడంతో ఆయన గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేశానని గూడూరు తెలిపారు.
సమన్వయ కమిటీ సమావేశంలో ఉత్తమ్‌కుమారెడ్డి
భువనగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్‌లో జూలై 16న నిర్వహించనున్న పార్లమెంట్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌లు పాల్గొననున్నారని గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. సమావేశంలో 7 నియోజకవర్గాల ముఖ్యనేతలు పాల్గొననున్నట్లుగా తెలియజేశారు. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్న జయలక్ష్మీ గార్డెన్‌ను శుక్రవారం గూడూరు నారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, నాయకులు ఎడమ బాలక్రిష్ణ, పిట్టల బాలరాజు, కొల్లోజు సతీష్, చల్లగురుగుల రఘుబాబు, తాడూరి నర్సింహ, సాబన్‌కార్ వెంకటేశ్, రాసాల దత్తుయాదవ్, సోమ రవీందర్‌రెడ్డి, కళ్యాణ్, రావుల రాజు, సాయి, నాగరాజు పాల్గొన్నారు.