క్రైమ్/లీగల్

ప్రియుడి ఆత్మహత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, జూలై 14: గత ఐదు రోజులుగా సంఛలనంగా మారిన వలిగొండ ప్రేమజంట వివాదం శనివారం మరో మలుపు తీసుకుంది. ప్రియుడు రావుల భాస్కర్ తనకు ప్రియురాలితో పెళ్లి వద్ధంటు శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ముందు క్రిమిసంహారక మందు తాగి, బ్లేడ్‌తో చేయి చేసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే పోలీసులు గమనించి భాస్కర్‌ను రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఐదు రోజుల క్రితం భువనగిరి మండలం చందుపట్లకు చెందిన వల్లపు జ్యోతి వలిగొండ వాసి రావుల భాస్కర్ తనను ప్రేమించి మోసం చేశాడంటు తనకు న్యాయం చేయాలంటు భాస్కర్ ఇంటి ముందు దీక్షకు పూనుకుంది. అనంతరం శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కి తనకు ప్రియుడు భాస్కర్‌తో వివాహం జరిపించాలంటు ఆత్మహత్య యత్నం చేసింది. రాచకొండ ఏసిపి రమేష్ ఆమెకు ప్రియుడు భాస్కర్‌తో వివాహం జరిపిస్తామని హామీ ఇచ్చి ఆత్మహత్య యత్నంను విరమింపచేశారు. అయితే జ్యోతితో పెళ్లి తనకు ఇష్టం లేదంటు శనివారం సాయంత్రం భాస్కర్ తన ఇంటి నుండి పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. దీంతో వలిగొండ పోలీసులకు ఈ ప్రేమజంట వివాదంలో మునుముందు ఎలాంటి వైఖరి అనుసరించాలన్నది సవాల్‌గా మారింది. కరువ మంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపమన్నట్లుగా ప్రియుడు భాస్కర్‌తో పెళ్లి చేయకపోతే తాను చస్తానంటు ప్రియురాలు జ్యోతి ఒకవైపు, ఆమెతో పెళ్లి చేస్తే తాను చస్తానంటు ప్రియుడు భాస్కర్ మరోవైపు ఆత్మహత్య యత్నాలతో పోలీసులను బెదరగొట్టడంతో వారు ఈ వివాదాన్ని తేల్చలేక తంటాలు పడుతున్నారు.