నల్గొండ

మంచోడుగా నటించి, నమ్మించి.. చిట్టీల పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 14: మంచివాడుగా నటించి, అమాయక ప్రజలను నమ్మించి చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేసి పెద్ద మొత్తం డబ్బులతో ఉడాయించిన ఘరానా మోసగాడి ఉదంతం చౌటుప్పల్ మండలం లక్కారంలో చోటుచేసుకుంది. చిట్టీల వ్యాపారీ పరారైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన ప్రసాదం కృష్ణ రెండున్నర దశాబ్దాల క్రితం లక్కారం గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. వికలాంగుల కాలనీలో ఇళ్లును కొనుగోలు చేసి చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. చిట్టీల సొమ్ము సమయానికి ఇస్తూ అందరితో కలిసిపోయి వ్యాపారాన్ని పెంచుకున్నాడు. చిట్టీలు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వకుండా మంచి మాటలు చెప్పి ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసేందుకు, పెళ్లిలకు డబ్బులు ఉపయోగించుకోవాలని బుద్ధి మాటాలు చెప్పి అట్టి డబ్బులను డిపాజిట్‌గా పెట్టుకోని వందకు నెలకు రెండు రూపాయల వంతుల వడ్డీ చెల్లించేవాడు. వచ్చిన వడ్డీని చిట్టీల డబ్బుల కింద జమ చేసుకుంటూ ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. దొరికిన దగ్గరల్లా డిపాజిట్లు సేకరించాడు. అవకాశాన్ని బట్టి 50 వేల నుంచి ఐదు లక్షల రూపాయల చిట్టీలను చేసాడు. వడ్డీకి ఇచ్చిన వారిని సైతం వేసి చిట్టీలలో సభ్యులుగా చేర్పించాడు. ఇళ్లును తాకట్టు పెట్టి రుణం పొందాడు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందగానే కుటుంబ సభ్యులతో ఉడాయించాడు. ఇంటికి తాళం వేసి ఉండటం, కృష్ణ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ ఉండటంతో అనుమానం వచ్చి ఆరా తీసారు. పథకం ప్రకారం బురిడీ కొట్టి ఉడాయించాడని తెలుసుకోని బాధితులు లబోదిబోమంటు కన్నీరు పెట్టుకున్నారు. చిట్టీల వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రసాదం కృష్ణ అమాయక ప్రజల నుంచి సేకరించిన డబ్బులు, చిట్టీల డబ్బుల వివరాలు సుమారుగా సేకరిస్తే కోటి రూపాయలు దాటినట్లు సమాచారం. ఇట్టి విషయాన్ని బాధితులు శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. తమ డబ్చులు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఘరానా మోసగాడి ఆచూకి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఐ వెంటయ్య చిట్టీల ఘరానా మోసంపై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

తూమును కాంక్రీట్‌తో నిర్మించండి
ఇంజనీర్‌ను ఆదేశించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
కోదాడ, జూలై 14: పగలకొట్టిన కోదాడ పెదచెరువు తూము అలుగును వెంటనే కాంక్రీట్‌తో నిర్మించాలని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి ఉత్తమ్‌రెడ్డి ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. పెదచెరువు తూము అలుగును పగలకొట్టి అక్రమంగా నీటిని కిందకు వదులుతూ వృధా చేస్తున్నారని ప్రజలనుండి వచ్చిన పిర్యాదుపై స్పందించిన కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతిరెడ్డి శనివారం కోదాడ పెదచెరువును స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. మట్టితో తాత్కాలికంగా పూడ్చిన చెరువు అలుగును చూసిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం వరకు చెరువు అలుగును శాశ్వతంగా కాంక్రీట్‌తో నిర్మించాలని ఆదేశించారు. చెరువుకు సంబందించిన వివరాలతోకూడిన బోర్డును చెరువువద్ద ఏర్పాటుచేయాలని ఆమె సూచించారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం స్వాగతించాల్సిందేనని కాని మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం చేసేందుకు పెదచెరువులోని నీటిని వృధాగా కిందకు వదలడం సరైంది కాదన్నారు. కోదాడ పట్టణ ప్రజలకు ప్రధాన నీటివనరుగా వున్న చెరువులోని నీటిని వృధా చేయడం వలన భూగర్భజలాలు పడిపోయి ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం వుంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులో పనులు చేసేందుకు చెరువునీటిని వృధాగా వదలడం వలన చెరువుకింద ఆయకట్టుకు సాగునీటి సమస్య ఏర్పడిందని ఆమె చెప్పారు. చెరువునీరు వృధాగాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కోరారు. చెరువులో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు.

అభివృద్ధే ధ్యేయం
-అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
యాదగిరిగుట్ట రూరల్, జూలై 14: యాదగిరిగుట్ట పట్లణ పరిధిలోని గుండ్లపల్లి,శ్రీరాంనర్,ప్రశాంత్ నగర్,యాదగిరిపల్లిలో 50 లక్షలలో సీసీ రోడ్డులు,అండర్ డ్రైనేజీ పనులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అభివృద్ది చేసేందకుకు ఎప్పుడూ ముందుంటానని అన్నారు.యాదాద్రి అభివృద్దితో పాటు స్థానికులకు,్భక్తులకు ఉపయోగంగా ఉండేందకు పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.సీసీ రోడ్డులతో పాటు అండర్ డ్రైనేజీనిలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు అనువుగా శుభ్రత ఉండాలన్న ద్యేయంతో పాలక వర్గం పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు.ఎంపీపీ గడ్డమీది స్వప్న రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట అభివృద్దికి విశేష కృషి చేస్తున్న ప్రభుత్వ విప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.సర్పంచ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే ఖర్చుకు వెకాడకుండా ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ది చేస్తున్న ప్రభుత్వ విప్‌కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ సభ్యురాలఅ కర్రె కమలమ్మ,ఎంపీటీసీ సభ్యులు సీస కృష్ణ,గుండ్లపల్లి శత్రజ్ఞ,వార్డు సభ్యులు కాటబత్తిని అంజనేయులు పాల్గొన్నారు.