నల్గొండ

‘డిండి’ సత్వరమే పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖరీఫ్‌కు నీరు విడుదల
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, జూలై 14: డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి ఖరీఫ్ పంటలకు సాగునీరందించాలని ప్రభుత్వం నిర్ణయించినందునా ఈ నెల 20వ తేదిలోగా మైనర్ వర్క్స్, పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, దేవరకొండ ఎమ్మెల్యే డి.రవీంద్రకుమార్‌లతో కలిసి కలెక్టరేట్‌లో ఆయకట్టు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతు సాధారణ వర్షాలు వరదలతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల నుండి వచ్చే కృష్ణా నీటితో ఆయకట్టుకు నీటి విడుదలకు నిర్ణయించారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 25్ఫట్ల మేరకు 1.2టింసిల నీరు ఉందని ఇందులో 0.2టిఎంసి డెడ్ స్టోరేజ్‌కాగా అందుబాటులో ఉన్న 1టిఎంసి నీటిని 10వేల ఎకరాల ఆయకట్టుకు అందించే అవకాశముందన్నారు. ప్రాజెక్టు షట్టర్లతో పాటు మెయిన్ కెనాల్ డిస్ట్రీబ్యూటరీ కెనాల్స్ పెండింగ్ పనులన్నింటిని ఈ నెల 20వ తేదిలోగా పూర్తి చేయాలన్నారు. డిండి రిజర్వాయర్‌లో నీరు తక్కువగా ఉండటంతో కల్వకుర్తి నుండి మరోసారి నీరందవచ్చని, రాని పక్షంలో ఉన్న నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇంతకుముందే ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపి ఉన్నందునా మరో 0.3టిఎంసి అదనంగా ఉన్నందునా పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతు గతంలో ఎప్పడు కూడా డిండి ఆయకట్టుకు రెండు పంటలకు నీరందలేదని కేవలం రబీకి మాత్రమే నీటి విడుదల పరిమితమైందన్నారు. ఈ దఫా ఖరీఫ్ పంటకు కూడా నీరందుతుందని, వేసవిలో తాగునీటి కోసం చెరువులను నింపి ఉండటంతో రైతులకు సాగునీటి కొరత ఏర్పడబోదన్నారు.
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతు ప్రభుత్వ నిర్ణయం మేరకు డిండి ఆయకట్టుకు త్వరలోనే నీటి విడుదల ఆరంభిస్తామన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, పనుల నాణ్యత, బిల్లుల చెల్లింపులో రాజీ పడవద్ధని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ హమీద్‌ఖాన్, ఈఈ భద్రునాయక్, ఏవో మోతిలాల్, రైతుల పాల్గొన్నారు.