నల్గొండ

డబుల్ ఇళ్ల కేటాయంపులోనూ తెలంగాణదే ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల పథకం కూడా ప్రపంచ కీర్తిని పొందిందని, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పేదలకు స్లాబ్‌తో కూడిన ఇండ్లు ఏదేశంలోనూ ఏప్రభుత్వాలు ఉచితంగా నిర్మించి ఇవ్వడం లేదని రాష్ట్ర విద్యుత్, ఎస్సీకులాల అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పెన్‌పహాడ్ మండలపరిధిలోని సింగిరెడ్డిపాలెం గ్రామంలో నిర్మించిన 102 రెండుపడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో డ్రా పద్దతిన ఎంపిక చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్‌ల సమక్షంలో చిన్నారులతో డ్రా తీయించి లబ్ధిదారులను గుర్తించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఎలాంటి వివక్షతకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నిరుపేదలను గుర్తించి ఇండ్లు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే నిర్మించి అందిస్తున్నట్లు చెప్పారు. నిరుపేదలు నివసించేందుకు గూడు లేక పడే ఇక్కట్లును గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి సకల వసతులతో కూడిన రెండుపడకల ఇండ్లను ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ది చెందిన విదేశాల్లో కూడా పేదలకు ఈతరహ పథకం అమలు చేయడం లేదన్నారు. జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని త్వరలోనే అన్ని ఇండ్లను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సింగిరెడ్డిపాలెంలో ఇండ్లు మంజూరైన లబ్దిదారులకు వంట పాత్రలను కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఇండ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్‌వో పబ్బతిరెడ్డి యాదిరెడ్డి, డీఆర్‌డీఎ పీడీ సుందరి కిరణ్‌కుమార్, ఆర్డీవో మోహన్‌రావు, డీఎఫ్‌వో ముకుందరెడ్డి పాల్గొన్నారు.