నల్గొండ

నవంబర్‌లో బుద్ధవనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్ హిల్ కాలనిలో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టును నవంబర్ నెలలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శుక్రవారం నాడు సాగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న లాంచీ స్టేషన్ జెట్టి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రస్తుతం నడిపిస్తున్న తాత్కాలిక లాంచీస్టేషన్, లాంచీలను పరిశీలించారు. ఆపై ప్రాజెక్టు హౌస్ హోటల్‌ను విపక్ష్యాన ధ్యాన కేంద్రాన్ని, బుద్ధవనం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నవంబర్ నెల వరకు బుద్ధవనం పనులను పూర్తి చేస్తామని నవంబర్ చివరి వారంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవిం ద్ చేతులమీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నీతి ఆయోగ్ నిధుల నుండి మంజూరైన ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సాగర్‌లో విజయవిహార్ దిగువ భాగంలో లాంచీ జెట్టిని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక్కడే 15 ఎకరాల స్థలంలో లాంచీ స్టేషన్ తో పాటు రెస్టారెంటు, వాటర్‌స్పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అన్ని అభివృద్ధి చేస్తున్నామని మనోహర్ తెలిపారు. వీరితో పాటు ఎస్‌ఈ క్రాంతిబాబు, డీఈఈ జగదీశ్ ఉన్నారు.

ఒక్క లారీ రోడ్డెక్కలేదు..
*కోదాడలో లారీలను అడ్డుకొన్న ఓనర్లు - సమ్మె సక్సెస్.. నల్లజెండాలతో నిరసన
కోదాడ, జూలై 20: డిమాండ్లను సాధించుకొనేందుకు దేశవ్యాప్తంగా లారీ యజమానులు ప్రారంభించిన నిరవధిక సమ్మె కోదాడలో విజయవంతమైంది. ఒక్కలారీ కూడా కోదాడలో రోడ్డెక్కలేదు. లారీ యజమానులు, డ్రైవర్లు, వర్కర్లు శుక్రవారం నల్లజెండాలు, రిబ్బన్‌లతో నిరసన ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుండి 65వ నెంబరు జాతీయరహదారిపై నల్లజెండాలు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను స్థానిక లారీ అసోసియేషన్ ప్రతినిధులు, డ్రైవర్లు అడ్డుకొని నిలిపివేశారు. పక్కనే వున్న ఖాళీస్థలంలో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను బలవంతంగా పార్కింగ్ చేయించారు. తెలుగురాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలుచేయాలని, డీజిల్‌కు జీఎస్టీ వర్తింపచేయాలని, డ్రైవర్లకు భద్రత కల్పించాలని, టోల్ రుసుములను ఎత్తివేయాలని తదితర డిమాండ్లతో లారీ యజమానులు దేశవ్యాప్త నిరవధిక సమ్మెను ప్రారంభించారు. డిమాండ్లను సాధించేంతవరకు సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ కోదాడ అధ్యక్షుడు రామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. గతంలో సమ్మె సందర్భంగా ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి పరిష్కరించకుండా మోసం చేసిందని ఈసారి మోసపోమని, తమ డిమాండ్లను అమలు చేసేంతవరకు సమ్మె చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కార్యదర్శి కనగాల నాగేశ్వర్‌రావు, పైడిమర్రి రమేష్, ఓరుగంటి కృష్ణమూర్తి, మిర్యాల వెంకటరెడ్డి, పొందూరి పాపారావు, దొంగరి శ్రీను, గన్నా లింగయ్య, చంటి, రవి, దుర్గ, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.