నల్గొండ

రైతుబీమాపై సర్కార్ ఫోకస్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకంలో అర్హులైన రైతులందరిని చేర్పించడంలో సాగుతున్న జాప్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితిలు రైతుబీమా పథకం నామినీల నమోదు ప్రక్రియను మందకొడిగా నిర్వహించడంతో ప్రత్యామ్నాయ ప్రచార మార్గాల దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆగస్టు 15 నుండి బీమా పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించాలన్న ప్రభుత్వ సంకల్ప సాధనకు నామినీల నమోదు వేగవంతం చేసేందుకు వినూత్నంగా విద్యార్థులను బీమా పథకం ప్రచార పర్వంలో భాగస్వాములను చేసింది. హుజూర్‌నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం రైతుబీమా పథకం ప్రయోజనాలపై విద్యార్థినులకు వివరించి వారి తల్లిదండ్రుల్లో రైతులుగా ఉన్నవారిని వెంటనే ఈ పథకంలో చేర్పించేలా చొరవ చూపాలని కోరారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాఠశాల ప్రారంభ సమయంలో వెళ్లి ప్రార్థన, ప్రతిజ్ఞ సమయంలో విద్యార్థులకు రైతుబీమా పథకం ఆవశ్యకతను వివరించారు. ఇదే రీతిలో ఇతర విద్యాసంస్థల్లో సైతం రైతుబీమా పథకం ప్రచారం సాగించే దిశగా జిల్లా రైతు సమన్వయసమితిలు ప్రయత్నిస్తూ వీలైనంత త్వరగా అర్హులైన రైతులందరిని రైతుబీమా పథకంలో చేర్పించే లక్ష్యాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది.
అలాగే సినిమాహాల్స్‌లో విశ్రాంతి సమయంలో, ప్రభుత్వ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల కేంద్రాల సభ్యుల ద్వారా, సహకార సంఘాలు, సమభావన సంఘాల ద్వారా రైతుబీమా పథకంపై విస్తృత ప్రచారం సాగించే దిశగా రైతుసమన్వయ సమితిలు, వ్యవసాయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు రైతుబీమా పథకం విజయవంతం కోసం నిరంతరం కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు వీలైనంత త్వరగా రైతుబీమా నామినీల నమోదు ప్రక్రయ పూర్తికి శ్రమిస్తున్నారు.
36.53లక్షల మందికి 26.13లక్షల మంది చేరిక..!
రాష్టవ్య్రాప్తంగా శుక్రవారం నాటికి రైతుబీమా పథకంలో అర్హులైన రైతుల్లో అధికార యంత్రాంగం, రైతు సమన్వయ సమితిలు 36లక్షల 53,854 మంది రైతులను సంప్రదించి నామినీ ఫారాలను అందించాయి. వీరిలో ఇప్పటిదాకా 26లక్షల 13,158 మంది రైతులు రైతుబీమాలో నమోదు చేసుకుని నామినీ పత్రాలు అందించారు. రాష్టవ్య్రాప్తంగా మరో 10లక్షల 40,696 మంది రైతులను రైతుబీమాలో నమోదు చేయాల్సి వుంది. రైతుబీమా పథకం వయసు పరిమితి మేరకు 4,92,160 మంది అనర్హులుగా ఉన్నారు. రాష్ట్రంలో రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2లక్షల 99,880 మంది రైతులను బీమా పథకంలో సంప్రదించగా, లక్ష 81,882 మంది నామినీ ఫారాలు అందించి పథకంలో చేరగా, లక్ష 16,998 మంది ఇంకా బీమా పథకంలో చేరాల్సివుంది. యాదాద్రి భువనగిరిలో 1,08,387 మందిని సంప్రదించగా 74,124 మంది పథకంలో చేరగా, 34,263 మంది నమోదుకావాల్సివుంది. సూర్యాపేటలో 1,35,213 మందికి 1,08,955 మంది చేరగా 27,118 మంది చేరాల్సివుంది.
జగిత్యాలలో 1,49,887 మందికి 84,276 మంది చేరగా, 65,611 మంది చేరాల్సి వుంది. మంచిర్యాలలో 97,716 మందికి 56,922 మంది చేరగా 40,794 మంది చేరాల్సివుంది. నిజామాబాద్‌లో 1,29,785 మందికి 1,05,902 మంది చేరగా 23,883 మంది చేరాల్సి వుంది. మెదక్‌లో 1,34,264 మందికి 86,834 మంది చేరగా 47,430 మంది చేరాల్సి వుంది. వరంగల్ రూరల్‌లో 1,16,556 మందికి 99,753మంది చేరగా 16,803 మంది చేరాల్సివుంది. సిద్ధిపేటలో 2,21,683 మందికి 1,45,487 మంది చేరగా 76,196 మంది చేరాల్సివుంది. మహబూబ్‌నగర్‌లో 1,87,782 మందికి 1,55,543 మంది చేరగా 32,239ల మంది చేరాల్సివుంది. రంగారెడ్డిలో 1,58,291మందికి 1,14,639మంది చేరగా 43,652 మంది చేరాల్సి వుంది. వికారాబాద్‌లో 1,23,839 మందికి 83,983 మంది చేరగా 39,8567 మంది చేరాల్సి వుంది. కామారెడ్డిలో 1,51,618 మందికి 1,06,005 మంది చేరగా 45,613 మంది చేరాల్సివుంది. నాగర్‌కర్నూల్‌లో 1,51,232 మందికి 1,11,748 మంది చేరగా, 39,484 మంది చేరాల్సివుంది. ఖమ్మంలో 1,87,476 మందికి 1,36,137 మంది చేరగా 51,339 మంది చేరాల్సి వుంది. మహబూబ్‌బాద్‌లో 1,01,852 మందికి 87,457 మంది చేరగా 14,935 మంది చేరాల్సి వుంది. జనగామలో 1,03,218 మందికిగాను 78,449 మంది చేరగా 24,769 మంది చేరాల్సివుంది. కరీంనగర్‌లో 1,00,555 మందికి 67,320 మంది చేరగా 33,235 మంది రైతులు చేరాల్సివుంది. నిర్మల్‌లో 1,07,494 మందికి 85,621 మంది చేరగా 22,233 మంది చేరాల్సివుంది. అదిలాబాద్‌లో 87,960 మందికిగాను 66,851 మంది చేరగా 21,109 మంది చేరాల్సివుంది.

లారీల సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి
*కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి, జూలై 20: లారీల యాజమానుల సమ్మె కారణంగా నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయాలు, రేషన్ బియ్యం, గ్యాస్, పెట్రోల్, వంట సామాగ్రి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ రవాణా, పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గుగులోతు రవినాయక్‌తో కలిసి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎల్‌పీజీ గ్యాస్, పెట్రోల్, కూరగాయాల విక్రయదారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నిత్యావసర వస్తువులు అంతరాయం లేకుండా ప్రజలకు అందేలా చూడాలని కోరారు. సమ్మె పేరుతో కృత్రిమ కొరత సృష్టించి నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరుకులు చేరవేసే లారీలను బలవంతంగా ఆపే పరిస్థితులు నెలకొనకుండా పోలీసు, రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే సమాచారం తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆర్డీవో పర్యవేక్షణలో డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. గ్యాస్, పెట్రోల్ బంకుల డీలర్లు పూర్తిస్థాయి సామర్థ్యంతో నిలువలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సంధ్యారాణి, ఏసీపీ జితేందర్‌రెడ్డి, రవాణా శాఖ అధికారి సురేందర్‌రెడ్డి, మైన్స్ ఏడీ అమరేందర్‌రావు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపిక్రిష్ణ, ఎస్‌వో బ్రహ్మరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.