నల్గొండ

స్వార్థం కోసం హత్యారాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గం ప్రశాంత వాతావరణంలో ఉండగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తన స్వార్థం కోసం ఇక్కడ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని టీ ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌లు ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి టీ ఆర్ ఎస్వీ నాయకుడు నరేందర్‌పై బీజేపీకి చెందిన వారు కత్తులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో సంకినేని ప్రాతినిధ్యం వహించిన తుంగతుర్తి నియోజకవర్గం నిరంతరం ఘర్షణలతో అట్టుడికేదని నేడు అదేవిధానాన్ని సూర్యాపేటలో కూడా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. సంకినేని కుమారుడు వరుణ్‌రావ్ యువతను మద్యంతో మభ్యపెట్టి తన బానిసలుగా మార్చుకొని రౌడీ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఓటమి భయంతోనే సంకినేని హత్యారాజకీయాలు చేసే స్థాయికి దిగజారాడని విమర్శించాడు. నరేందర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యారాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

తెలంగాణ తెచ్చింది రైతుల కోసమే
-గుడిపల్లి సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
పెద్దఅడిశర్లపల్లి, జూలై 21: తెలంగాణ రైతాంగానికి న్యాయంగా రావాల్సిన నది జలాల సాధన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గుడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11కెవి ఉప విద్యుత్ కేంద్రాన్ని ఆయన జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్, ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతు ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణ ప్రాంతం నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోయిందన్నారు. తెలంగాణ సాధించుకోవడంతో కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కాళేశ్వరం, పాలమూరుడిండి, డిండి ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టి పాత ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా సీఎం కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర విద్యుత్ అందించి నిర్భంధంగా బిల్లుల వసూలు చేయగా, స్వరాష్ట్రంలో నిరంతర ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, ఎంపిపి మేడారం రాజమ్మ, వైస్ ఎంపిపి గాజిరామ్, సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, ఎంపిటిసి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.