నల్గొండ

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, జూలై 21: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం గట్లమల్లెపల్లి గ్రామంలో ప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్ యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేసి, అనంతరం మండల పార్టీ సమావేశంలో మాట్లాడారు. నరేంద్రమోదీ పాలనలో 200కుపైగా సంక్షేమ పథకాలు దేశ ప్రజల కోసం అందిస్తున్నారన్నారు. దేశంలో అవినీతి లేని సుపరిపాలనతో దేశాభివృదిధకి కృషి చేస్తున్నారన్నారు. రైతుల కోసం ఫసల్ బీమా, అటల్ పింఛన్, ప్రధాన మంత్రి దీన్ దయాళ్ యోజన వంటి పథకాలు అమలవుతున్నాయన్నారు. సీఎం కెసిఆర్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ప్రాజెక్టుల పేరిట దోపిడి చేస్తున్నారని, మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయగా మారిందన్నారు. తెలంగాణలో బిజెపి రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా ఎదిగి అధికారంలో వస్తుందన్నారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాదాద్రి బృందం
యాదగిరిగుట్ట, జూలై 21: వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారిని శనివారం యాదాద్రి దేవస్థానం బృందం దర్శించుకుంది. యాదాద్రి ఆలయం విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న శివాలయం నిర్మాణం, అనుసరించాల్సిన పూజలపై ఈ సందర్భంగా భద్రకాళి అర్చక బృందం, యాదాద్రి అర్చక, అధికారుల బృందం చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ప్రతిష్టాచార్యులు శేషగిరిరావు, యాదాద్రి అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఏఈవో వి.రాంమోహ, సత్యనారాయణశర్మ, జి.నరసింహ, రాములు, ఉద్యోగ జెఎసి చైర్మన్ జి.రమేష్‌బాబు, కార్యర్శి జగన్‌మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధికి కేసీఆర్ కృషి

- అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైళ్ల శంకుస్థాపన
భూదాన్ పోచంపల్లి, జూలై 21: మండల కేంద్రంలోని నారాయణగిరి స్టేజి వద్ధ బస్టాప్ నిర్మాణ పనులకు, మోడల్ స్కూల్ వంటశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన, స్వామిరామనంద గ్రామీణాభివృద్ధి సంస్థ వద్ద పైలాన్ ప్రారంభం, ఎస్సీ కాలనీలో 86లక్షలతో నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శనివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. పోచంపల్లి గ్రామాలను దత్తత తీసుకుని సుమారు మూడుకోట్ల నిధులతో సిసి రోడ్లను, డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలోనే రాష్ట్భ్రావృద్ధి సాగిందని, గత ప్రభుత్వాల హాయంలో అభివృద్ది కుంటుపడిందన్నారు. ప్రజాసంక్షేమం ధ్యేయంగా తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సాలా సరస్వతి, జడ్పీటీసి మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపిపి మందాడి సుధాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు కొమిరెల్లి నరసింహారెడ్డి, గుండు మధు, భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, కర్నాటి రవి పాల్గొన్నారు.

నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి
భూదాన్‌పోచంపల్లి, జూలై 21: నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులు 34మందికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పేద కుటుంబాలకు సీఎం కెసిఆర్ పెద్దన్నలా ఆదుకుంటున్నారన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రజాదరణతో అధికారంలోకి వస్తామన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలిచిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కెసిఆర్ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయన్నారు.