నల్గొండ

గత పాలకుల నిర్లక్ష్యం.. అప్పుల్లో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, జూలై 21: ఉమ్మడి రాష్ట్ర పరిపాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ రైతాంగం ఆర్ధికంగా చితికిపోయి అప్పుల పాలైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపిడివో కార్యాలయాన్ని ఆయన జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్, ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతు అప్పులు లేని రైతులను చూడటం కోసమే సీఎం కెసిఆర్ రైతుబంధు పథకం తెచ్చారని, రుణమాఫీ చేశారన్నారు. రైతుభద్రత కోసం రైతుబీమా అమలు చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు పాత ప్రాజెక్టులను కొనసాగిస్తునే కొత్తగా కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తు అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ అగ్రగామిగా నిలిపారన్నారు. అమ్మఒడి, కెసిఆర్‌కిట్, ఆసరా, కల్యాణలక్ష్మి, సన్న బియ్యం, ఆరోగ్య లక్ష్మి, ఉచిత విద్యుత్, గురుకుల పాఠశాలలు, కళాశాలలలు, వృత్తిదారులకు గొర్రెలు, చేపపిల్లలు, బర్రెలు అందిస్తున్నారన్నారు. చేతి వృత్తిదారులకు చేయూతనిస్తు చేనేతలకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. గిరిజన తండాల అభివృద్దికి పంచాయతీలుగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రవి, జడ్పీటిసి హరి, ఈఎన్‌సి సత్యనారాయణెడ్డి, ఎంపిడివో మమతాభాయి తదితరులు పాల్గొన్నారు.