నల్గొండ

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటరూరల్, జూలై 21: మండలపరిధిలోని బాలెంల గ్రామ ఆవాసంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల కళాశాలలో డిగ్రీ తృతియ సంవత్సరం మైక్రోబయాలజీ చదువుతున్న సాక్షర (19) అనే విద్యార్థిని గత రెండురోజుల క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. కళాశాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మోతె మండలం నేరేడువాయి గ్రామానికి చెందిన సాక్షర గురుకుల కళాశాలల్లో డిగ్రీ చదువుతొంది. కాగా గురువారం రాత్రి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సాక్షర చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. సాక్షర మృతిచెందిన విషయం తెలియడంతో కళాశాలలో చదువుతున్న స్నేహితురాలు శ్రీవాణి శనివారం కళాశాలలో తీవ్ర ఒత్తిడికి లోనై కళ్లు తిరిగి పడిపోగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీవాణి గుండె వేగంగా కొట్టుకుంటుందని చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపటికే కళాశాలలోని మరో విద్యార్థిని అనూష కళ్లుతిరిగి పడిపోవడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో ఒక విద్యార్థిని మృతిచెందడం, మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తోటి విద్యార్ధినులు భయాందోనలనకు గురవుతున్నారు. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి అధికారులతో కలిసి శనివారం సాయంత్రం కళాశాలను సందర్శించి విద్యార్ధిని మృతిపై కళాశాల యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో పారిశుద్య నిర్వాహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కళాశాల సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారిణి కళావతిబాయి, డీఆర్‌డీఎ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
కళాశాలలో విద్యార్థులు అనారోగ్యానికి గురికావడానికి కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష వైఖరే కారణమని ఆరోపిస్తూ పలు విద్యార్థి సంఘాల సంఘాల నాయకులు కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. పీడీఎస్‌యూ. ఎంఎస్‌ఎఫ్ సంఘాల నాయకులు కళాశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. మృతిచెందిన సాక్షర కుటుంబానికి ఆర్ధికసాయం అందజేసి నిర్లక్షంగా వ్యవహరించిన అధ్యాపకులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.