నల్గొండ

డిండి ప్రాజెక్ట్ దౌర్భాగ్యం ప్రకృతి పాపం కాదు.. పాలకుల శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ / డిండి, జూలై 21: ప్రకృతి శాపం వల్ల డిండి ప్రాజెక్ట్‌కు దౌర్భాగ్యం పట్టలేదని పాలకుల శాపం వల్లే డిండి ప్రాజెక్ట్ రైతులకు పనికి రాకుండా పోయిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ నీటిని శనివారం మంత్రి జగదీశ్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆర్ సీ ఎం అయిన తర్వాత తెలంగాణ లోని సాగునీటి ప్రాజెక్ట్‌ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు సాధ్యమైనంత వరకు ప్రాజెక్ట్‌ల ద్వార సాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. డిండి ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటి నిల్ల సామర్ధ్యం 36 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 25 అడుగుల నీరు నిలువ ఉందని చెప్పారు.
ఈ నీటి వల్ల ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టు పరిధి లోని 12,500 ఎకరాల భూమికి సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ప్రకృతి కూడా సహకరించి మంచి వర్షాలు కురిసి డిండి ప్రాజెక్ట్ లోకి వరద నీరు చేరితే రైతులకు పంట చివరి వరకు సమృద్దిగా నీరు లభించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు సాగు నీటిని వృధా చేయకుండా పొదుపుగా నీటిని వాడుకొని మంచి దిగుబడులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
డిండి ప్రాజెక్ట్‌లోకి ఈ సంవత్సరం కల్వకుర్తి ఎత్తిపోతల పధకం ద్వార నీటిని తరలించి ఆయకట్టు పరిధి లోని పలు గ్రామాలలో చెరువులు, కుంటలను నింపినట్లు తెలిపారు. దీని వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు సమృద్దిగా పెరిగాయని రైతులు దీన్ని గమనించాలని కోరారు. 5 సంవత్సరాలలో డిండి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే రోజులు వచ్చాయన్నారు. రాష్ట్రం లోనూ, నల్లగొండ జిల్లాలోనూ ఆ పార్టీ నాయకులు గెలవలేరని జోస్యం చెప్పారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నామన్నారు. స్ధానిక వనరులను పూర్తి స్ధాయిలో వినియోగించుకొనేందుకు సీ ఎం కేసీ ఆర్ అనేక ప్రయత్నాలను చేస్తున్నాడన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా పరిషత్ చైర్మెన్ నేనావత్ బాలూనాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బండారు బాలనర్సింహ్మ, ఎంపీపీ వీరగాని నాగమ్మ, రాంకిరణ్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసీ ఆలంపల్లి నర్సిం హ్మ, ఆర్ వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో లింగ్యానాయక్, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాపుగల్లు ధాన్యం అక్రమాలపై.. సమగ్ర విచారణ
*బాధ్యులైన అధికారులపై చట్టరీత్యా చర్యలు *పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్
సూర్యాపేట, జూలై 21: జిల్లా పరిధిలోన కోదాడ మండలం కాపుగల్లు సింగిల్ విండోలో వెలుగు చూసిన ధాన్యం కొనుగోలు అక్రమాలపై సమగ్ర విచారణ చేపడతామని, ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమీషనర్ అకున్‌సబర్వాల్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో కాపుగల్లు సోసైటీలో జరిగిన అవకతవకలపై జేసీ సంజీవరెడ్డి, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుగల్లు సహకార సంఘంలో 2015లో ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఈక్రమంలో 63 మంది బోగస్ రైతులకు రూ.83.93లక్షల అక్రమంగా చెల్లించినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి అందుకు కారణమైన సోసైటీ పాలకవర్గం నుండి రికవరీ చేసి అర్హులైన 75 మంది రైతులకు చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. మరో 16 మంది రైతులకు రూ.39లక్షలు చెల్లించాల్సి ఉందని దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేస్తామన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈవ్యవహారంలో ప్రమేయం ఉన్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని బాధ్యులందరిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈసమావేశంలో సూర్యాపేట, నల్లగొండ డీఎస్‌వోలు ఎ.ఉషారాణి, ఉదయ్‌కుమార్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌లు బి.రాంపతినాయక్, నాగేశ్వరరావు, ఇరు జిల్లా డీసీవోలు ఎస్వీ ప్రసాద్, శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ ముత్తారపు పాండురంగారావు, కోదాడ తహశీల్థార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రికి ఐఎస్‌ఓ గుర్తింపు
- అభినందించిన సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట, జూలై 21: యాదాద్రి దేవస్థానం హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్ట్ఫికేషన్ ప్రైవేట్ లిమిడెట్ సంస్థ జారీ చేసే ప్రతిష్టాత్మక ఐఎస్‌వో సర్ట్ఫికెట్ అందుకుంది. పర్యావరణం, భద్రత, నిర్వాహణ, విద్యుత్ మేనేజ్‌మెంట్ వంటి పలు అంశాల ఆధారంగా ఐఎస్‌వో సర్ట్ఫికెట్‌ను కేటాయిస్తారు. ఆయా ఆంశాల్లో ఉత్తమ నిర్వాహణకుగాను యాదాద్రి దేవస్థానానికి ఐఎస్‌వో సర్ట్ఫికెట్ దక్కగా, దేశంలో తొలిసారిగా ఒక దేవాలయానికి ఐఎస్‌వో సర్ట్ఫికెట్ రావడం విశేషంగా నిలిచింది. కాగా ఐఎస్‌వో సర్ట్ఫికెట్ సాధించిన నేపధ్యంలో వైటిటిఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు శనివారం సీఎం కెసిఆర్‌ను కలిసి ఐఎస్‌వో సర్ట్ఫికెట్‌ను అందించి వివరాలు తెలిపారు. దేవస్థానం పునర్ నిర్మాణ పనులు, డిజిటిలైజేషన్ వివవరాలను, దేవస్థానం వార్షిక పురోగతిని సీఎం కెసిఆర్‌కు వారు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ యాదాద్రి ఆలయానికి ఐఎస్‌వో సర్ట్ఫికెట్ దక్కడం పట్ల వారిని అభినందించారు. ఆలయ నిర్మాణ పనులు నాణ్యతో వేగంగా పూర్తి చేయాలని, ఆలయ పనులతో పాటు ఇతర శాఖల పనులన్ని కూడా సమాంతరంగా ముందుకు సాగాలని సూచించారు.