నల్గొండ

25న చలో హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 12: విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు జనాబా దమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 25న ఇందిరా పార్కు వద్ద చలో హైదరాబాద్ గిరిజన మహాసభను విజయవంతం చేయాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు నేనావత్ సిపాయి నాయక్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గిరిజన రిజర్వేషన్ సాధన సమితి జిల్లా వైస్ చైర్మన్ నాగరాజు నాయక్‌తో కలిసి మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి పోరాడి ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు, గిరిజనుడు ఠానునాయక్ నుండి మొదలు మలి దశ ఉద్యమంలో ప్రస్తుత సిఎం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష కాలంలో మొదట ప్రాణాలు కోల్పోయిన విద్యార్ధి అమరులు భూక్యా ప్రవీణ్‌నాయక్, మంటలను ముద్దాడిన భోజ్యానాయక్ లాంటి వీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో గిరిజనుల రిజర్వేషన్లు 6నుండి 12శాతం, వస్తాయని గిరిజనుల కష్టాలు తీరుతాయని ఆశించిన వారేనని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని రిజర్వేషన్ కోసం సంప్రదించగానే నూతన రాష్ట్రం ఇప్పుడే పుట్టిన పసి బిడ్డగా వర్ణించి కొంతకాలం, మరోసారి అడిగితే చెల్లప్ప కమిషన్ పేరుతో కొంత కాలం ఇలా రెండు సంవత్సరాలు తాత్సారం చేశారని, రిజర్వేషన్లు పెంచక పోవడంతో విలువైన విద్యా సంవత్సరాలను విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక కోర్సుల్లో వేలాదిగా సీట్లను కోల్పోతున్నారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో గిరిజన రిజర్వేషన్ సాధన సమితి ఆవిర్భవించిందని, ప్రతి తండాలో విద్యార్ధి యువకులను చైతన్యపరిచి రిజర్వేషన్ సాధించుకోవాలని నిర్ణయించి గిరిజనులతో భారీ ప్రదర్శన బహిరంగ సభను నిర్వహించ నున్నామని, ఈ కార్యక్రమానికి వేలాధిగా ఎవరి రొట్టె వారే తెచ్చుకుని కదన రంగంలో భాగస్వాములై పోరాటానికి కదలి రావాలని పిలుపునిచ్చారు.