క్రైమ్/లీగల్

అసభ్య మెసేజ్‌లతో మహిళలను వేధిస్తున్న ఆకతాయ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఆగస్టు 7: ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ మహిళలను వేధించడమే గాక డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కునుమళ్ళ శ్రీనివాస్ అనే ఆకతాయని దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకతాయ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో రిమాండ్ చేసినట్లు దేవరకొండ సీఐ ఎంజీఎస్ రామకృష్ణ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శాంపూర్ గ్రామానికి చెందిన కునుమళ్ళ శ్రీనివాస్ అనే యువకుడు అమ్మాయిలకు ఫోన్‌కాల్స్ చేసి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. ఈ క్రమంలో అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని దేవరకొండ పట్టణానికి చెందిన ఓ మహిళ దేవరకొండ ఫిర్యాదు చేసింది. షీటీం ఇన్‌చార్జి బాలస్వామి, కానిస్టేబుళ్ళు రాములునాయక్, ఉపేందర్‌లతో సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ జరిపి ఆకతాయి అయిన శ్రీనివాస్‌ను ఆదిలాబాద్ జిల్లా శాంపూర్ గ్రామానికి వెళ్ళి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎవరైన ఆకతాయిలు సెల్‌ఫోన్‌లలో యువతులకు వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఎంజీఎస్ రామకృష్ణ చెప్పారు. వేధింపులకు గురయ్యే మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. విలేఖరుల సమావేశంలో షీటీం ఇన్‌చార్జి బాలస్వామి, ఎస్‌ఐ సర్దార్, హెడ్‌కానిస్టేబుల్ చంద్రవౌళి, కానిస్టేబుళ్ళు ఉపేందర్, రాములునాయక్, హోంగార్డ్ చంద్రవౌళి పాల్గొన్నారు.

పొలం వద్ద ఘర్షణలో ఒకరు మృతి
మర్రిగూడ, ఆగస్టు 7: ఇరువురి వ్యవసాయ భూములు పక్క పక్కనే ఉండటంతో గత కొన్ని రోజులుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈనెల 6న మండలంలోని కుదాభక్షుపల్లి గ్రామానికి చెందిన పంతంగి జంగయ్య తన పొలంలో బోరు వేయించాడు. ఈక్రమంలో అదే గ్రామపంచాయతీ పరిధిలోని వెంకేపల్లి తండాకు చెందిన రమావత్ లచ్యా కరెంటు వైరు తెగిపడింది. మంగళవారం పొలానికి వెళ్లిన బిచ్యా కరెంటు వైరు తెగిపడటంతో జంగయ్యతో వాగ్వాదానికి దిగాడు. పరస్పరం ఘర్షణ పడ్డ ఇద్దరిలో లచ్యా జంగయ్యపై రాయి విసరడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం శ్రీమంతులగూడెం సమీపంలో సంఘటన జరగగా మంచాల, మర్రిగూడెం మండలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంగయ్య కుటుంబ సభ్యులు, బంధువులు చావుకు కారణమైన లచ్యా ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. అప్పటికే నిందితుడు పరారు కావడంతో వెంకేపల్లి తండాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మృతుడికి భార్య, కుమారుడు, కూతూరు ఉండగా భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

డాక్టరై వస్తాడుకుంటే శవమై వచ్చాడు
- గుజ్జ నవీన్ తల్లిదండ్రుల రోదనలు
- భౌతికఖాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే పైళ్ల
భువనగిరి, ఆగస్టు 7: ఇటీవల రష్యాలో మెడిసిన్ విద్యనభ్యసిస్తు దుర్మరణం పాలైన గుజ్జ నవీన్ మృతదేశం మంగళవారం భువనగిరికి చేరుకుంది. 5 సంవత్సరాల మెడిసిన్ విద్యను పూర్తి చేసుకున్న నవీన్ మరో సంవత్సరం విద్యనభ్యసించి డాక్టరై వస్తాడనుకుంటే శవమై వచ్చాడని తల్లిదండ్రులు గుజ్జ యాదగిరి, హేమలతలు విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. భువనగిరి ఎమ్మల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ క్రిష్ణారెడ్డి గుజ్జ నవీన్ భౌతికఖాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.