నల్గొండ

బీసీలు పాలకులుగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 17: జనాభా ధామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కడంలేదని పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణలో అగ్రవర్ణాలదే ఆధిపత్యం సాగుతుందని, రాజ్యాధికారం దిశగా బీసీలు కలసి కట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. శుక్రవారం పట్టణంలోని గౌడ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రవర్ణాల దగ్గర యాచించే దుస్థితి నుండి పాలించే దిశగా బీసీలు ఏక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో అసువులు బాసింది బీసీలే అధికంగా ఉన్నారని, ఉద్యమాలు చేసి పోలీసుల లాఠీ దెబ్బలు తినేది, జైళ్లపాలయ్యేది బీసీలేనని ప్రాణ త్యాగాలు చేసింది బీసీలేనని అన్నారు. అగ్రవర్ణాలు 5 శాతం ఉండి రాజ్యాధికారంలో 40 శాతం ఉంటున్నారని బీసీలు 60శాతం ఉంటే రాజ్యాధికారంలో 19శాతం ఉంటున్నారని ఈ వ్యత్యాసమే మనల్ని బానిసలుగా చేస్తోందన్నారు. పంచాయతీల నుండి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలన్నారు. అధికారం కోసం అగ్రవర్ణాలు పోటీ పడుతుంటే రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా రాజకీయాలకతీతంగా ఉద్యమించాలని పేర్కొన్నారు. 2019లో బీసీలకు 65 స్థానాలు కేటాయించిన పార్టీని ఆదరించి వారిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించేందుకు సంఘటితగా కృషిచేయాలని సూచిం చారు. బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. బీసీలను రాజకీయాలలో చైతన్యం చేయడానికి బస్సు యాత్ర మెదలు పెడితే అగ్రవర్ణాల వారు నవ్వుతున్నారని బీసీలలో ఐక్యత తెచ్చేవారు ఎవ్వరు లేరని మనల్ని విభజించి పాలించాలని అగ్రవర్ణాల వారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎర చూపి ఆకర్శించి మనల్ని మోసం చేస్తున్నారన్నారు. తాను బస్సు యాత్ర చేస్తే బీసీలు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నాయని ఒక్కగానొక్క బీసీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ ఉంటే అతడిని ఓడించిన ఘనత అగ్రవర్ణాలదే అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం నర్సింహ, ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, మండల అధ్యక్షుడు అశోక్ చారి, సాంబేష్, సూదగాని వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, గుర్రం వసంత, చాడ లక్ష్మీ, గోర్ల సుధా, అక్కనపల్లి వెంకటేష్, పర్వతాలు, పుప్పల నర్సింహ పాల్గొన్నారు.