నల్గొండ

మట్టి విగ్రహాలనే పూజిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, సెప్టెంబర్ 12: శ్రీగణేశ్ నవరాత్రి ఉత్సవాలలో మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బుద్దా మురళి అన్నారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో గల శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టివిగ్రహాల పంపిణీకి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటుచేసి పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. విద్యార్థులకు మట్టి విగ్రహాలను, నోటు పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రామక్రిష్ణ, నాయకులు మల్లగారి శ్రీనివాస్, ఎంపీటీసీ పంజాల వెంకటేశ్‌గౌడ్, టీ.సత్యనారాయణ, గార్లపాటి క్రిష్ణమూర్తి, గుడిపాటి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి
హుజూర్‌నగర్, సెప్టెంబర్ 12: హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన దుగ్గి భువనేశ్వరి ( 24) డెంగ్యూ జ్వరంతో ప్లేట్ లెట్స్ కోల్పోయి మృతి చెందారు. గత 15 రోజులుగా పట్టణంలో డెంగ్యూ, వైరల్, టైఫాయిడ్, సీజనల్ జ్వరాలు అధికమైనాయి. ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రైవేటు వైద్యశాలలు జ్వరాల రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవైటు వైద్యశాలలో చేరిన రోగులను రెండు మూడు రోజులు చికిత్స చేయడం అనంతరం ప్లేట్ లెట్స్ తగ్గటంతో హైద్రాబాద్ పంపిస్తున్నారు. అక్కడ చేరిన కార్పొరేటు వైద్యశాలల్లో లక్షలు వ్యయం చేసినా ప్రయోజనం లేక ఇటీవలే ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెడు వర్షాలు కురవటంతో భూమిలోని వైరల్, బ్యాక్టీరియా, జెమ్స్ బయటకు వచ్చి డెంగ్యూ, వైరల్, టైఫాయిడ్ జ్వరాలు చాలా మందికి వ్యాపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ధనవంతులు పట్టణాలకు వెళ్లి లక్షల రూపాయలతో వైద్యం చేయించుకుంటుండగా పేదలు, మధ్య తరగతి వారు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొంది ప్రమాదకరంగా మారాక నగరం వెళ్లి మృత్యువాతకు గురవుతున్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
* మాజీ విప్ గొంగిడి సునీతా రెడ్డి
ఆత్మకూర్(ఎం), సెప్టెంబర్ 12: సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని రీతిలో అమలు చేసిన 450 ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ముందస్తు ఎన్నికల్లో పార్టీని తనను గెలిపించాలని మాజీ విప్, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి కోరారు. బుధవారం మండలంలోని పుల్లాయిగూడెం గ్రామంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతు మండలంలోని కాటేపల్లి నుండి పుల్లాయిగూడెం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ అనంతరం ఆమె సభలో మాట్లాడారు. రానున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అప్పుడు నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని పనులు జరిపిస్తానన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను నియోజకవర్గ ప్రజలకు అందిస్తానన్నారు. అనంతరం టీడీపీ నుండి వంద మంది కార్యకర్తలు, మహిళలు టీఆర్‌ఎస్‌లో చేరగా ఆమెవారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గొంగిడి మహేందర్‌రెడ్డి, నాయకులు మోతె పిచ్చిరెడ్డి, ఎంపీపీ కే.్భగ్యశ్రీ భానుప్రకాశ్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు యాస కవిత, మండల పార్టీ అధ్యక్షుడు పాశమయ్య ఉప్పలయ్య, యాస ఇంద్రారెడ్డి, కె.రంగారెడ్డి, నాగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు.