నల్గొండ

కేసీఆర్ గుర్తించి న్యాయం చేయాలనే సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 12: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికైనా తనను గుర్తించి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే తమ నాయకుల, కార్యకర్తల అభీష్టం మేరకు ర్యాలీ, సభ నిర్వహించామని పార్టీ నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హైద్రాబాద్ నుండి మిర్యాలగూడకు వచ్చిన సందర్భంగా పట్టణ శివారులోని ఏడుకోట్ల తండా వద్ద కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో బైక్‌ర్యాలీలో ప్రజలకు అభివాదం తెలుపుతూ రాజీవ్‌చౌక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తాను టీఆర్‌ఎస్‌లో ముందుగా చేరి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇంకా అనేక మంది ప్రజా ప్రతినిధులను గెలిపించుకుని పార్టీని బలోపేతం చేశారనన్నారు. అనుకోని అతిథిగా పార్టీలోకి వచ్చిన భాస్కర్‌రావు తనతో వచ్చిన వారికే పార్టీ, నామినేట్ పదవుల్లో ప్రాధాన్యతన్నిస్తూ ముందు నుండి పార్టీ కోసం పని చేసిన వారిని అన్యాయం చేశారన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పార్టీ నాయకత్వాన్ని కోరుతానన్నారు. కార్యక్రమంలో నాయకులు గాయం ఉపేందర్‌రెడ్డి, గుడిసె దుర్గాప్రసాద్, గంధం సైదులు, ఆవుల పీతాంబర్‌రెడ్డి, దండ ప్రభాకర్‌రెడ్డి, రజిని, ఎండి.్ఫహీముద్దీన్, ఎండి.హబీబ్, మాడుగుల శ్రీను, జహీరుద్దీన్, కౌన్సిలర్లు పశ్యా శ్రీనివాస్‌రెడ్డి, తూడి అశోక్‌రెడ్డి, శాగ జయలక్ష్మిజలంధర్‌రెడ్డి, గుడిసె జానకి, ఇలియాస్‌లు పాల్గొన్నారు.
నాపై దుష్ప్రచారం
వాట్సాప్‌లలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును తాను రూ. 3కోట్లు అడిగినట్టు చేస్తున్న దుష్ప్రచారాన్ని అమరేందర్ రెడ్డి ఖండించారు. తనను భాస్కర్‌రావు కలిసి మాట్లాడటం సహకరించమని కోరడం వాస్తవమన్నారు. అయితే ఆయన కలవగా తాను 3 కోట్ల రూపాయలు అడిగానని వాట్సాప్‌లలో ప్రచారం చేయడం జరుగుతోందని, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భాస్కర్‌రావుకు ఎన్నికల్లో సహకరించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. తనను పార్టీ అధిష్ఠానం గుర్తించాలని లేకుంటే బరిలో ఉండటం తప్పదన్నారు.