నల్గొండ

మహిమాన్వితం మత్స్యగిరి క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, సెప్టెంబర్ 12: మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల మత్స్యగిరి క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందని ఎమ్మెల్సీ ఏలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్‌నాథ్‌రెడ్డిలు అన్నారు. బుధవారం నాడు మత్స్యగిరిగుట్ట నూతన చైర్మన్, పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వారు మాట్లాడుతూ మత్స్యగిరిగుట్ట క్షేత్రం దేశంలోనే అరుదైన క్షేత్రమని ఇక్కడి మీనాలకు మీసాలు ఉండడం ఈ క్షేత్రం గొప్పదనమని, పుష్కరిణిలోని నీరు ఏకాలంలోనైన సమృద్ధిగా ఉండడం, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలియడం ఇక్కడి ప్రాముఖ్యతయన్నారు. నూతన చైర్మన్ తాజాగా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గర్భాలయం నూతనంగా నిర్మించేందుకు రూ.50లక్షలు మంజూరు చేశామన్నారు. అంతకు ముందు దేవస్థానం ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మీ, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డిలు పాలకవర్గంలో చైర్మన్‌గా కేశిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లుగా సుర్కంటి లక్ష్మారెడ్డి, కరకంటి చంద్రయ్య, తుమ్మల దామోదర్, శ్యామల సుదర్శన్‌రెడ్డి, మద్దెల ధనుంజయ్య, ఓరుగంటి స్వామి, పబ్బు స్వామి, కాసుల పెద్దులు, అంబటి మోహన్, జెట్టి నరేశ్, బుంగమట్ల సుధాకర్, తక్కళ్ల పద్మ, కళ్లెం బాలశంకర్, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రతాపురం శ్రీనివాసచార్యులుచే ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్థన్‌రెడ్డి, వంగాల వెంకన్నగౌడ్, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, పబ్బు ఉపేందర్‌బోస్, తుమ్మల యుగంధర్‌రెడ్డి, చిట్టెడి జనార్థన్‌రెడ్డి, గూడూరు శివశాంత్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, బద్దం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.