నల్గొండ

యాదాద్రిలో ఘనంగా నిత్యారాధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 12: అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యరాధనలు, ఆర్జీత సేవలు సంప్రదాయంగా సాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కోలిపి హరిత నివేధన చేశారు. బిందే తీర్థం, బాలబోగంతో ఆలయ కైంకర్యాలు ప్రారంభించారు. ప్రతిష్టామూర్తులను ఆరాధించిన అర్చక బృందం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. సుగంధ పరిమళాలు, పూలమాలలు పట్టువస్త్రాలు, స్వర్ణారత్నాభరణలతో అలంకరించారు. దర్శనమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణమండపంలో అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని పంచారాత్ర ఆగమశాస్త్రానుసారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యాహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజ వాహన సేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు బాల ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోత్తరం, సహస్రనామార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్ల వెండిజోడి సేవోత్సవాన్ని శాస్తయ్రుక్తంగా నిర్వహించారు.