నల్గొండ

టీఆర్‌ఎస్‌లో అసమ్మతి జ్వాలలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 12: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థులపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మునుగోడు, నాగార్జున సాగర్, దేవరకొండ, తుంగతుర్తి, నల్లగొండ అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల నరసింహయ్య, ఆర్.రవీంద్రకుమార్, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డిలకు వ్యతిరేకంగా టికెట్లు ఆశించి భంగపడిన ఆశావహుల, అసమ్మతి వాదుల కార్యకలాపాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అసమ్మతివాదుల బహిరంగ నిరసనలు, బలప్రదర్శనలు టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి, అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. తాజాగా అసమ్మతివాదుల బహిరంగ ప్రదర్శనల తాకిడి మిర్యాలగూడ అభ్యర్థి ఎన్.్భస్కర్‌రావును కూడా తాకింది. భాస్కర్‌రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో ఆది నుండి పనిచేసిన తనకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి బుధవారం నియోజకవర్గం కేంద్రం మిర్యాలగూడలో వేలాది మందితో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించి బలప్రదర్శనతో గట్టి సవాల్ విసిరారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలన్న యోచనతో అమరేందర్‌రెడ్డి సాగుతుండటం టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని కలవరపెడుతోంది.
మరోవైపు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ నియోజకవర్గ గత ఇన్‌చార్జి, గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన దుబ్బాక నరసింహారెడ్డి బుధవారం అసమ్మతి స్వరం వినిపించారు. నార్కట్‌పల్లిలో బీసీ నేత తండు సైదులుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తన వర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ దుబ్బాకకు టికెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని కార్యకర్తలు గట్టిగా సూచించడంతో దుబ్బాక ఈ దిశగా ఆలోచన చేస్తుండం చర్చనీయాంశమైంది. ఈనెల 17న తన మద్దతుదారులతో నల్లగొండ గడియారం సెంటర్‌లో భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలని ఈ సమావేశంలో దుబ్బాక నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. దుబ్బాక, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చకిలం అనిల్‌కుమార్ వర్గీయులు సైతం బహిరంగంగా కంచర్ల అభ్యర్థిత్వంపై అసమ్మతి వెళ్లగక్కారు. చాడ కిషన్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండ నరేందర్‌రెడ్డిలు మాత్రం కంచర్ల గెలుపు కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇక్కడ దుబ్బాక టీఆర్‌ఎస్ రెబల్‌గా పోటీ చేస్తే మాత్రం ఎంపీ గుత్తా వర్గీయులు కూడా ఆయనకు లోపాయికారిగా సహకరించే అవకాశం లేకపోలేదు.
అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల నరసింహయ్యకు టికెట్ కేటాయించడం పట్ల స్థానిక నేత ఎం.సీ.కోటిరెడ్డి ఇప్పటికే తేరా చిన్నపరెడ్డి వర్గీయులతో కలిసి నోములకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. బుధవారం కోటిరెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేఖరుల సమావేశం నిర్వహించి నోములకు టికెట్ రద్దు చేసి నియోజకవర్గానికే చెందిన బీసీలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వెంటే మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కేడర్ ఉన్నారని లెక్కలతో సహా ఏకరవు పెట్టారు. టీఆర్‌ఎస్‌లో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపధ్యంలో కోదాడ, హుజూర్‌నగర్‌లలో అభ్యర్థులను ప్రకటించాక కూడా అసమ్మతి మరింత ముదిరే అవకాశముందని పార్టీ కేడర్ భావిస్తోంది. పార్టీ అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగి అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతిని చల్లార్చని పక్షంలో అసమ్మతి సెగలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతికూలంగా మారుతాయన్న అందోళన గులాబీ కేడర్‌లో వ్యక్తమవుతోంది.