నల్గొండ

ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ముందస్తుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ మోదీతో కుమ్మక్కై అసెంబ్లీ రద్దు చేయించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. బుధవారం మిర్యాలగూడ ఎన్‌ఎస్‌పీ అతిధి గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా లేవనుకుని ముందస్తుకు వెళ్లేందుకు కేసీఆర్ పథకాలు చేశారని, ఆయన పథకాలు తలకిందులవుతాయన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, ప్రజలు ఇంకా ఆయనకు ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. జనవర్ 1, 2019నాటికి 18 లక్షల మంది యువకులు ఓటర్లుగా నమోదయ్యే అవకాశాలున్నాయని, వారిని కాదని హడావుడిగా ఎన్నికలకు వెళ్లేందుకు అధికారులను సన్నద్ధం చేశారని ఆరోపించారు. లక్షల మంది నూతన ఓటర్లకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఓటర్ల పరిశీలనలో 18లక్షల మంది ఓట్లు కోల్పోయారని వారికి తిరిగి ఓటు హక్కు కల్పించేందుకు హడావుడిగా నమోదు కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, జనసేన పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని త్వరలో సీట్లపై చర్చించనున్నామన్నారు. కేసీఆర్ కుటుంబ అరాచక పాలనకు అంతమొందించేందుకు అన్ని పార్టీలు ఏకం కావడం ఖాయమన్నారు. తెలంగాణ పట్ల టీడీపీకి ఎంతో ప్రేమ ఉందని, లేదని టీఆర్‌ఎస్ వారు గోబెల్స్ ప్రచారం చేయడం తగదన్నారు. దుష్టచతుష్టయమని మహాకూటమిని ఎంపీ కవిత వర్ణించడం తగదని, వారిదే దుష్ట చతుష్టమని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బండ్రు శోభారాణి అన్నారు. సమావేశంలో టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కా నర్సింహా, కార్యనిర్వాహక కార్యదర్శి సాధినేని శ్రీనివాస్‌రావు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు ఎండి.యూసుఫ్, పెద్దిరెడ్డి రాజా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చిలువేరు కాశీనాధ్, అంజయ్యయాదవ్, నాయకులు పాతురి ప్రసాద్, కాసుల సత్యం, బాసానిగిరి, జడ రాములుయాదవ్, జె.రాములుగౌడ్, బాబురావునాయక్‌లు పాల్గొన్నారు.

కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రణయ్ కుటుంబం
నల్లగొండ, సెప్టెంబర్ 19: పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి, ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, మరియమ్మ, ప్రణయ్ తమ్ముడు అజయ్‌లు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏ.వి.రంగనాథ్‌ను కలిశారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అమృత వర్షిణికి రూ.8 లక్షలు వస్తుందని, ఇప్పటికే నాలుగు లక్షలు ఇచ్చామని, చార్జిషీట్ వేశాకా మిగతా నాలుగు లక్షలు ఇస్తామన్నారు. అలాగే అమృత వర్షిణికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు ఆమె విద్యార్హతలను పరిశీలించారు. అలాగే ప్రణయ్ కుటుంబ సభ్యులు ప్రణయ్ హత్య కేసు విచారణను వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కలెక్టర్, ఎస్పీలను కోరారు. స్పందించిన కలెక్టర్, ఏస్పీలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుతో కేసు విచారణ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రణయ్ కేసు విచారణలో ఎన్నో అనుమానాలు
* టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం
మిర్యాలగూడ, సెప్టెంబర్ 19: మిర్యాలగూడలో హత్యకు గురైన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ హత్య కేసు విచారణలో పోలీసుల విచారణ అనుమానాలకు తావిస్తున్నదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్‌కుమార్ ఇంటిని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రణయ్ హత్య కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన నల్లగొండ ఎస్పీ రంగనాథ్ నిందితులకు బెయిల్ దొరుకుతుందని పేర్కొనడం దారుణమన్నారు. నిందితుల సమక్షంలో ఇలా మీడియా ముందు చెప్పడం విచారకరమన్నారు. అదేవిధంగా అమృతను మానసికంగా, శారీరకంగా వేధించిన బాబాయి శ్రవణ్‌కుమార్‌ను ఏ2 గా ఉండాలి అతన్ని ఏ6 నిందితుడిగా చేయడం దారుణమన్నారు. ప్రణయ్ హత్య వెనుక ఉన్న రాజకీయ పార్టీల నాయకులపై సమగ్ర విచారణ జరిపి వారిపైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అమృతను ప్రభుత్వం, పోలీసులు రక్షణ కల్పించాలని, ఆమెకు భద్రతతో పాటు, ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. ఆయన వెంట నాయకులు ధర్మార్జున్‌రెడ్డి, గవ్వా విద్యాధర్‌రెడ్డి, నాళ్ల అంజయ్య, డేగ విటి, క్రాంతిలున్నారు.

ప్రణయ్ కేసు విచారణ సమగ్రంగా జరపాలి
* ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 19: ప్రణయ్‌కుమార్ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారణ చేయాలని ఏపీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ కోరారు. బుధవారం రాత్రి ప్రణయ్ ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రణయ్ తల్లిదండ్రుల కథనం ప్రకారం తండ్రి మారుతిరావు, బాబాయి శ్రవణ్‌ల ప్రధాన పాత్ర కాగా, శ్రవణ్‌ను ఏ6 నిందితుడిగా పేర్కొన్నారన్నారు. పోలీసుల కేసు నమోదు చేసిన విధానం సక్రమంగా లేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణకు న్యాయమూర్తిని నియమించాలని కోరారు. ఆయన వెంట మాలమహానాడు నాయకులు రవి, శివరాం, కాంతయ్య ఉన్నారు.