నల్గొండ

మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆదరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, సెప్టెంబర్ 19: గడిచిన నాలుగున్నర ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దూసుకెళ్ళిందని, మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గుడిపాటి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్టీ మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం మరోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పుట్ట అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2700 కోట్లు తెప్పించామన్నారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో లబ్ధిపొందిన వారి సంఖ్య నూటికి 80శాతం ఉందని వీరంతా కారుకే ఓటు వేయడం ఖాయమన్నారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార కోలహలం
నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోసం ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్ బుధవారం ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యాలయం ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణంలో ఎన్నికల ప్రచార ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో పండ్లబండ్లు, వ్యాపార దుకాణాలలో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి కిషన్‌రావు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్, చిట్యాల మార్కెట్ చైర్మన్‌లు మారం భిక్షంరెడ్డి, కాటం వెంకటేషం, వైస్ చైర్మన్ వీర్లపాటి రమేష్, జడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, వైస్ ఎంపీపీ సామ బాలమ్మ, నాయకులు సిలివేరు ప్రభాకర్, పల్‌రెడ్డి నర్సింహరెడ్డి, కొండ వెంకన్న, గాదగోని కొండయ్య, సోమా యాదగిరి, మంగినపల్లి రాజు, యానాల లింగారెడ్డి, సామ శ్రీనివాస్‌రెడ్డి, మాద ఎల్లేష్ తదితరులు ఉన్నారు.

ఆలేరు గౌరవం నిలబెట్టేందుకే పోటీ
* మాజీ మంత్రి మోత్కుపల్లి
తుర్కపల్లి, సెప్టెంబర్ 19: తాను రాజకీయాల కోసం కాకుండా ఆలేరు ప్రాంత గౌరవాన్ని నిలబెట్టేందుకే ఇండిపెండెంట్‌గా ఆలేరు నుండి ముందస్తు ఎన్నికల బరిలోకి దిగుతున్నానని మాజీ మంత్రి, ప్రజావేదిక వ్యవస్థాపకుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జెఎం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన గోదావరి జల సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతు టీడీపీ అధినేత చంద్రబాబు వంచనకు గురైన తనను ఆలేరు ప్రజలు ఆదరించి పోటీకి ఆహ్వానిస్తున్నారని, ఎమ్మెల్యేగా గెలిపించితే ఈ ప్రాంతానికి గోదావరి జలాలు అందించి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదే ఆఖరి ఎన్నికలని మోత్కుపల్లి ప్రకటించారు. అధికార, ప్రతిపక్షాల అభ్యర్థులు నోట్ల కట్టలు పట్టుకుని గ్రామాల్లో ఓట్ల కోసం తిరుగుతున్నారని, వారి నోట్లే వారిని ఓడిస్తాయన్నారు. తాను చేపట్టిన ప్రజా ఉద్యమాల ఫలితంగానే యాదాద్రి భువనగిరి జిల్లా సాధించామని, గంధమల్ల రిజర్వాయర్ సాధించామని, ఆలేరు రైల్వేగేట్ తిరిగి ఓపెన్ చేశారన్నారు. గంధమల్ల, బస్వాపుర్ రిజర్వాయర్‌ల నిర్మాణాల నిర్వాసితులకు భూమికి భూమి, ఇంటికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వాలన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్టలో ఈనెల 27న మోత్కుపల్లి శంఖారావం బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ముకుంద్‌రెడ్డి, మారగోని శ్రీరాంమూర్తి, మోత్కుపల్లి రఘు, నారాయణ, వెంకటేశ్వం, కోట భిక్షపతి, దుర్గయ్య, ఎర్రోళ్ల రాములు, పోశంరెడ్డి, సంజీవ్ పాల్గొన్నారు.

సకాలంలో పంట రుణాలివ్వాలి
* బ్యాంకర్ల సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా
నల్లగొండ, సెప్టెంబర్ 19: రైతులకు సకాలంలో పంట రుణాలివ్వాలని రుణ పంపిణీ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు రైతులకు ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా రైతుబంధు చెక్కుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఈ వార్షిక సంవత్సరం ఖరీఫ్ రుణ పంపిణీ లక్ష్యం 1253కోట్లకుగాను 33శాతం మాత్రమే ఇచ్చారన్నారు. ధరణి వెబ్‌సైట్ అప్‌డేట్ కాకపోవడంతో, రైతులు రెన్యూవల్‌కు ముందుకు రాకపోవడంతో, రుణమాఫీ హామీల నేపధ్యంలో పంట రుణ పంపిణీ నెమ్మదిగా సాగుతుందన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా లక్ష్యాలు చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తుందన్నారు. ఆక్టోబర్ నుండి ప్రారంభమయ్యే రబీ సీజన్‌లో మార్చి వరకైనా రుణాలు అందించాలన్నారు. మాడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాల పంపిణీ సబ్సిడీ అందగానే క్లియర్ చేయాలన్నారు. ఈ రుణాలు సైతం అధిక శాతం పెండింగ్‌లో ఉండటం పట్ల గుత్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతు రుణ పంపిణీ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు రైతులను చైతన్యపరుచాలన్నారు. లక్ష్యాలను చేరుకోవడంలో మరింత కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం, ఎంజిఎం దయామృత, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.