నల్గొండ

వ్యూహం.. ప్రతి వ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 19: మందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో రాజకీయం వేడెక్కుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న దరిమెలా తమ వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సూర్యాపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసి రెక్కీ జరిగినట్లుగా గుప్పుమన్న ప్రచారం కలకలం రేకెత్తించింది. మంత్రికి ప్రాణహాని తలపెట్టేందుకే గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ చేపట్టినట్లుగా మీడియాలో జరిగిన ప్రచారం రాష్టవ్య్రాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ కోణంలో అధికార పార్టీ నేతలే మీడియాకు లీక్‌లుచ్చినట్లుగా తొలుత ప్రచారం జరిగినా టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈనెల 2న కొంగరకలాన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రగతి నివేదన సభ జరిగిన రోజున పోలీసు యంత్రాంగం, గులాబీ శ్రేణులు సభ హడావుడిలో ఉన్న సమయంలో చేపట్టినట్లు తెలియడంతో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు సైతం ఈవిషయంపై విచారణ జరుపుతున్నామని, కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై బీజేపీ తరుపున సూర్యాపేట నుండి పోటీలో నిలవనున్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మంత్రి రాజకీయ ప్రత్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు డ్రోన్ కెమెరాతో తన తనయుడు వరుణ్‌రావు నాగారంలో మంత్రి ఇంటి పరిసరాల్లో ఫొటోలు, వీడియాలు తీసినట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారింది.
అయతే నాగారంలో మంత్రి నూతనంగా చేపడుతున్న ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా సాగుతోందని, అక్రమంగా లక్ష ట్రిప్పుల చెర్వుమట్టిని తరలించి ఆరు మీటర్ల మేరా ఎత్తుపెంచి ఇంటిని నిర్మిస్తుండటం వల్ల సమీపంలో ఉన్న ఎస్సీ, బీసీ వాడలు ముంపునకు గురవుతున్నాయని, అంతేకాకుండా జనగాం- సూర్యాపేట రహదారి విస్తరణ కోసం తొలగించిన భారీ వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి తన నూతన నివాసం చుట్టూ రీ ప్లాంటేషన్ చేసుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బాధ్యతయుత ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ఫొటోలు తీయిస్తే ఆ అంశాన్ని కూడా మంత్రి తనకు ప్రాణహాని ఉన్నట్లుగా చిత్రీకరించుకొని రాజకీయ సానుభూతిని పెంపొందేందుకు యత్నిస్తున్నాడని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రికి తానే గట్టి పోటీ ఇస్తానని భావించి రాజకీయంగా తనను ఎదుర్కోలేక రెక్కీ పేరుతో రాజకీయం చేస్తూ తనను ఉగ్రవాదిగా చూపే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకేసులో మంత్రి ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరో అడుగు ముందుగు వేసి డ్రోన్ కెమెరాల విషయంలో కేసులు పెడితే భయపడేది లేదని, ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించేందుకు గవర్నర్‌తో పాటు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు సంకినేని బీజేపీ రాష్ట్ర నేతలను కలిసేందుకు హైదరాబాద్‌కు బయలుదేరారు. టీఆర్‌ఎస్ నేతలు సైతం సంకినేనిని దీటుగా ఎదుర్కొనేలా ముందుకు సాగుతున్నారు. మంత్రి స్థాయి వ్యక్తి ఇళ్లు నిర్మిస్తున్న చోట పోలీసుల అనుమతి లేకుండా సంఘ విద్రోహశక్తుల్లా ఎలా డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తారని మండిపడుతున్నారు. నిబంధనలను అతిక్రమించిన సంకినేని తనయుడు, అందుకు ప్రేరిపించిన సంకినేనిలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహరాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే దిశగా అధికార పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఈవ్యవహరం ఎటూ వైపు మలుపు తిరుగుతుందో.. ఏ పార్టీ ఏ ఎత్తుగడతో ముందుకు సాగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆదరించండి
* భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్
నకిరేకల్, సెప్టెంబర్ 19: గడిచిన నాలుగున్నర ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దూసుకెళ్ళిందని, మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గుడిపాటి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పార్టీ మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం మరోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పుట్ట అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2700 కోట్లు తెప్పించామన్నారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో లబ్ధిపొందిన వారి సంఖ్య నూటికి 80శాతం ఉందని వీరంతా కారుకే ఓటు వేయడం ఖాయమన్నారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార కోలహలం
నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోసం ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్ బుధవారం ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యాలయం ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణంలో ఎన్నికల ప్రచార ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో పండ్లబండ్లు, వ్యాపార దుకాణాలలో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి కిషన్‌రావు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్, చిట్యాల మార్కెట్ చైర్మన్‌లు మారం భిక్షంరెడ్డి, కాటం వెంకటేషం, వైస్ చైర్మన్ వీర్లపాటి రమేష్, జడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, వైస్ ఎంపీపీ సామ బాలమ్మ, నాయకులు సిలివేరు ప్రభాకర్, పల్‌రెడ్డి నర్సింహరెడ్డి, కొండ వెంకన్న, గాదగోని కొండయ్య, సోమా యాదగిరి, మంగినపల్లి రాజు, యానాల లింగారెడ్డి, సామ శ్రీనివాస్‌రెడ్డి, మాద ఎల్లేష్ తదితరులు ఉన్నారు.