నల్గొండ

టికెట్ ఇవ్వకపోతే ఆత్మాహుతికి వెనుకాడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 19: తనకు హుజూర్‌నగర్ టికెట్ ఇవ్వకపోతే తన కుమారుడు, అమరుడు శ్రీకాంతా చారి వలే తాను ఆత్మాహుతి వెనుకాడబోనని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. హుజూర్‌నగర్ నుండి పోటీ చేస్తానంటున్న ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డికి మీసంతో పాటు రోషం కూడా లేదని, అతనికి డబ్బు ఉంటే ఖర్చు చేసి తనను గెలిపించాలని అన్నారు. బుధవారం టీఆర్‌ఎస్ కార్యకర్తల భారీ మోటారు సైకిల్ ర్యాలీలో మాట్లాడుతూ తన కుమారుడు శ్రీకాంతా చారి ప్రాణత్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తన కుమారుడు మరణించే ముందు అమ్మ అమ్మా అనలేదని జై తెలంగాణ అన్నారన్నారు. కాలుతున్న శరీరంతో అంబేద్కర్ విగ్రహన్ని కౌగలించుకున్నారన్నారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా హుజూర్‌నగర్‌లోనే ఉండి 20 శాతం మాత్రమే ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని 80 శాతం వరకు అభివృద్ధి చేశానని, ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రతి ఇంటికి చేరినందున ఈసారి తాను ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తేలికగా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి జి జగదీశ్ రెడ్డి కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తన వెనుక నలుగురు కార్యకర్తలు లేరని ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డి అన్నారని, నేడు 7 మండలాల నుండి వచ్చిన వేలాది మంది కార్యకర్తలే తన వెనుక ఉన్నారనటానికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు. సైదిరెడ్డి కూడా స్థానికుడు కాదని కెనడాలో ఉండి బాగా సంపాదించి పదవి కొరకు ఇటీవల వచ్చారని తాను గత ఐదేళ్లుగా ప్రజల, కార్యకర్తల మధ్య ఉండి పనులు చేస్తున్నానని శంకరమ్మ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తామని శంకరమ్మ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో 7 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి చేశా.. ఆదరించండి
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చౌటుప్పల్, సెప్టెంబర్ 19: మునుగోడు నియోజకవర్గాన్ని నాలుగున్నరేళ్లలోనే అన్నిరంగాలలో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించేందుకు ఆదరించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రజలను వేడుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలోని తాళ్లసింగారం, లింగోజిగూడెం గ్రామాలలో ఆయన బుధవారం పర్యటించారు. ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు కుంకుమ తిలకం దిద్ది ఆహ్వానించారు. గ్రామాల్లో ప్రధానంగా తాగునీరు. సీసీ రోడ్లు, వీధి దీపాలు, మురుగు కాలువల పరిస్థితిని తెలుసుకున్నారు. నూతన మున్సిపాల్టీకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వనున్నట్లు చెప్పారు. త్వరలో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత జలాలు అందనున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చేసే వారికే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆరున్నర దశాబ్దాల కాలంలో మును‘గోడు’ ఎవరికి పట్టలేదన్నారు. ఆంధ్రపాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో మునుగోడు అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఎం.డి.బాబాషరీఫ్, వీరమళ్ల సత్తయ్యగౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, జి.అయోధ్య, నల్ల అంజయ్య, నల్ల గణేష్‌యాదవ్, ఆరుట్ల శంకర్, మండారి మార్కు, లక్ష్మయ్య, మారయ్య, పాక చిరంజీవి, కొసనం శ్రీ్ధర్‌రెడ్డి, మల్లయ్య, నరసింహా పాల్గొన్నారు.