నల్గొండ

నల్లగొండకు చేరిన నూతన ఈవీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో త్వరలో ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో బెంగుళూరు నుండి బందోబస్తుతో గురువారం జిల్లా కలెక్టరేట్‌కు నూతన ఈవీఎంలు చేరుకున్నాయి. దీంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రాజకీయ పార్టీల నాయకులు, జేసి నారాయణ రెడ్డి సమక్షంలో పరిశీలించారు. అనంతరం యంత్రాలను గోడౌన్‌లలోకి తరలించారు.
ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం
నాగార్జునసాగర్, సెప్టెంబర్ 20: నాగార్జునసాగర్‌లో ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్య చేసుకోవాలని సాగర్ వచ్చిన మహిళను గుర్తించి తిరిగి వారి బంధువులకు అప్పజెప్పిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సాగర్ ఎస్‌ఐ శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన కుక్కల శిరీష తన ఇద్దరి పిల్లలతో నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీ నది తీరం వద్ద అనుమానాస్పదంగా కన్పించడంతో ఆమెని పోలీస్ స్టేషన్ తీసుకవచ్చి వివరాలు సేకరించారు. తన భర్త మల్లిఖార్జునకు తాను రెండవభార్య అని భర్త సరిగా చూసుకోకపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తన ఇద్దరి పిల్లలను తీసుకోని సాగర్‌లో ఆత్మచేసుకోవడానికి వచ్చినట్లు తెలిపింది. స్థానిక ఎస్‌ఐ శీనయ్య ఆమెకు మనోధైర్యం కల్పించి బంధువులకు సమాచారం అందించి వారికి అప్పజెప్పారు.

బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 20: జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడి నేరస్తులుగా ఉన్నవారు, నేర చరిత్ర గలవారు, రౌడీషీటర్లపై మరింత నిఘా పెంచుతామని, క్రిమినల్ రికార్డులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రంగనాథ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వీరి కదలికలను గమనించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రౌడీషీటర్లపై, పాత నేరస్థులపై గట్టి నిఘా పెంచుతామని, భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసినా, నరుూం బ్యాచ్ పేరుతో బెదిరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

కొండగడప విలీనంపై హైకోర్టు స్టే
మోత్కూర్, సెప్టెంబర్ 20; నూతనంగా ఏర్పడిన మోత్కూర్ మున్సిపాల్టీలో కొండగడప గ్రామాన్ని విలీనం చేయడంపై ఆ గ్రామ అఖిలపక్షం, గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించగా, విలీనంపై స్టే విధించినట్లుగా స్థానిక ఎంపీటీసీ వై.పద్మనర్సయ్య గురువారం విలేఖరులకు తెలిపారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఏకపక్షంగా విలీనం చేయడంతో 1045 మంది ఉపాధి హామీ పథకం కూలీలు జీవనోపాధి కోల్పోతున్న విషయాన్ని కోర్టుకు వివరించామన్నారు. గ్రామ జనాభా 3,500 ఉందని, విలీనంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 14రకాల పనులు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.