క్రైమ్/లీగల్

ప్రేమ పేరుతో వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్(ఎం), సెప్టెంబర్ 20: యువతిని ప్రేమించి గర్భవతిని చేసిన నిర్వాకం బయటపడటంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి మూహుర్తం పెట్టడంతో కులాంతర పెళ్లి ఇష్టం లేదని యువకుడు బలవన్మరణం చేసుకున్న ఘటన ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో వెలుగుచూసింది. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన కట్టేకోల కిరణ్‌గౌడ్ (23) గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని ప్రేమించాడు. ఏడాది క్రితం వారి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు కిరణ్‌గౌడ్‌ను, అతడి తల్లిదండ్రులను పెద్దల మధ్య పంచాయతీకి పిలిచి ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దంటు తీర్మానించుకున్నారు. తదుపరి కాలంలో కూడా కిరణ్‌గౌడ్ సదరు యువతితో తన ప్రేమాయణం కొనసాగించగా ఆమె ఏడునెలల గర్భం దాల్చింది. ఈ వ్యవహారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రులు, ఆమె తరుపు పెద్ద మనుషులు కిరణ్‌గౌడ్‌ను ఆమెను తప్పక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. బుధవారం యువతి, యువకుల ఇరువురి కుటుంబాలు మాట్లాడుకుని గురువారం పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇంతలో తనకు కులాంతర వివాహం ఇష్టం లేదని కిరణ్‌గౌడ్ హైద్రాబాద్‌కు పారిపోగా అతడి తల్లిదండ్రులు అతడిని పిలిపించి పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో తాను ప్రేమించిన యువతితో తనకు కులాంతర వివాహం చేస్తారని భావించిన కిరణ్‌గౌడ్ ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని గ్రామశివారులోని మామిడి తోటలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కట్టేకోల ప్రభాకర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ కె.యాదగిరిగౌడ్ తెలిపారు.