నల్గొండ

ఢిల్లీ పెత్తనం.. తెలంగాణ ఆత్మాభిమానం మధ్యే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, సెప్టెంబర్ 20: టీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే అధిష్ఠానమని మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ పెత్తనానికి, తెలంగాణ ఆత్మాభిమానానికి మధ్య జరుగనున్నాయన్నారు. ప్రతిపక్షాలది మహాకూటమి కాదు, అది ఒక కుట్రల కూటమిగా అభివర్ణించారు. గురువారం డివిజన్ కేంద్రంలో పర్యటించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దిక్కుతోచని పరిస్థితిలో అధికార దాహంతో సిద్ధాంతాలను సైతం పక్కకు పెట్టి కుట్రల కూటమిని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో విజయం మాదేనన్నారు. ఢిల్లీ పెద్దలకు నాయకులెవరో తెలియడంలేదన్నారు. కార్యకర్తలు, ప్రజలను ఏవిధంగా గుర్తుపెట్టుకుంటారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన సురేష్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మునుగోడు అసెంబ్లీ నుంచి వలసవాదులు రాబోతున్నారని హెచ్చరించారు. స్థానికంగా నాయకులు లేక ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులకు టికెట్లు ఇస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఆత్మగౌరవానికి వేసినట్లేనన్నారు. ఎన్ని కూటమిలు ఏకమైన టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరన్నారు. వంద సీట్లకు పైగా విజయం సాధించి రాష్ట్రంలో కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఇక్కడ గెలుపు ఖాయమని, మెజార్టీ కోసమే ప్రయత్నాలని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు ఊడుగు రమేష్‌గౌడ్, ఊడుగు మల్లేశంగౌడ్, చిరందాసు ధనుంజయ్య, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, చెన్నగోని అంజయ్య, ముత్యాల భూపాల్‌రెడ్డి, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, ముత్యాల మోహన్‌రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22న విద్యా సంస్థలకు సెలవు
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 20: జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం పురస్కరించుకుని ఈనెల 22న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లుగా నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఈ మేరకు విద్యాసంస్థలు సెలవు అమలు చేయాలని ఆదేశించారు.

ప్రణయ్ హత్య సమాజానికి తలవంపు
* కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 20: మిర్యాలగూడలో దళిత యువకుడు పీ.ప్రణయ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ ఘటన సమాజానికి తలవంపు అని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడలో ప్రణయ్‌కుమార్ ఇంటిని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు చైతన్యవంతులై దుండగులను అడ్డుకోవాలన్నారు. ప్రజలు తగు రీతిలో ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ వారితో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆమె వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కే.శంకర్‌నాయక్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, ముండ్లగిరి కాంతయ్య ఉన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య మహిళా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శారద, ఆర్.్భవాని, అనుపమ తదితరులు ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించారు.

అసలు కుట్రను బహిర్గతం చేయాలి
* మంత్రికి ఎలాంటి హాని జరిగినా సంకినేని బాధ్యత వహించాలి
* రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
సూర్యాపేట, సెప్టెంబర్ 20: మంత్రి జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారంలో దొంగచాటున డ్రోన్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేందుకు అసలు కారణాలు ఏంటో, దాని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని పోలీసులు సమగ్ర విచారణ చేసి బహిర్గతం చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్‌చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 2న గుర్తుతెలియని వ్యక్తులు నాగారంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందిందని, ఈ అంశంపై మీడియాలో కథనాలు రావడంతో పోలీసు విచారణను తప్పుదోవ పట్టించే కుట్రతో బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు తానే కెమెరాలతో చిత్రీకరించినట్లు ప్రకటనలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. సంకినేని నేరచరిత్ర కలిగిన వ్యక్తని ఆయన మంత్రి నివాసంతోపాటు గ్రామంలో ఫొటోలు, వీడియోలు తీసి ఎవరికి పంపారో, ఎందుకు పంపారో పోలీసులు విచారించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి రూ.3500 కోట్లతో సూర్యాపేటను ఎంతో అభివృద్ధి చేశారని దీంతో ఆయన గెలుపును అడ్డుకోలేమనే భావనతో, ఓటమి భయంతో సంకినేని తెరచాటు కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఐనప్పటికి మంత్రి భద్రతకు సంబంధించిన అంశం అయినందున ఈవిషయంపై లోతైన విచారణ చేపట్టాలని త్వరలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. మంత్రికి ఏ హాని జరిగినా అందుకు సంకినేనే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, తూడి నర్సింహారావు, చందుపట్ల పద్మయ్య, ఎలుగూరి రమాకిరణ్, నక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు.