నల్గొండ

పార్టీ మారను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 21: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీస్‌లు జారీ చేయడం పార్టీలో అలజడి రేపింది. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి పీసీసీ కమిటీల ఏర్పాటులో బ్రోకర్లు, పైరవీ కారులకు, ప్రజల్లో బలం లేనివారికి కమిటీల్లో పదవులు ఇచ్చారని, పార్టీని గెలిపించే సత్తా ఉన్న తనలాంటి వారిని పార్టీ బాధ్యతలకు దూరంగా పెట్టారని రాజగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా తెలంగాణ కాంగ్రెస్‌కు పట్టిన శని అని ఆయన ఘాటుగా విమర్శించారు. పార్టీ నిర్ణయాలపై ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గీసిన గీత దాటి మరి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేసినట్లుగా భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. షోకాజ్ నోటీస్‌పై రాజగోపాల్‌రెడ్డి ఎలా స్పందిస్తారోనని, పార్టీని వీడుతారా? లేక మునుగోడు బరిలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా? కాంగ్రెస్ అధిష్ఠానం రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తుందా? అన్న సందేహాల్లో కాంగ్రెస్ కేడర్ అంతా రోజంతా చర్చోపచర్చల్లో మునిగారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడితే ఉమ్మడి జిల్లాలో పార్టీకి నష్టమన్న ఆలోచనతో కేడర్ ఆందోళన చెందింది.
అయితే షోకాజ్ నోటీస్, కాంగ్రెస్ సీనియర్ల బుజ్జగింపులతో మెత్తపడిన రాజగోపాల్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో తాను పార్టీకి నష్టం చేసే ఉద్దేశంతో కమిటీల కూర్పు, కుంతియాపై విమర్శలు చేయలేదని వారికి కనువిప్పు కల్గించాలని, కార్యకర్తల ఆవేదన వినిపించాలనే అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే తనలాంటి వారిని దూరం పెట్టడాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఇలాగైతే మరోసారి పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఇదే అంశంపై ఆవేదనను మాత్రమే తాను మాట్లాడనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌ను సవాల్ చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పార్టీలో సరైన స్థానం ఎందుకు ఇవ్వడం లేదన్న ఆవేదన కార్యకర్తల్లో ఉందన్నారు. పార్టీలో హనుమంతరావు చెప్పినట్లుగా కోవర్టులున్నారన్నారు. బలహీనమైన అభ్యర్థులను నిలిపి పరోక్షంగా కేసీఆర్‌కు సహకరించే కుట్ర చేస్తున్నారన్నారు. కుంతియా ప్రజల్లో బలం ఉన్న నాయకులను, గెలుపు గుర్రాలను, తనవంటి యువ నాయకులను గుర్తించి పార్టీ గెలుపునకు ఉపయోగించుకోవాల్సిందిపోయి పాత పద్ధతిల్లోనే పార్టీని నడిపిస్తుండటం సరికాదన్నారు. రాష్ట్ర పార్టీలో తనవంటి వారి వాదనను హైకమాండ్‌కు చెప్పాల్సిన బాధ్యత కుంతియాపై ఉందన్నారు. షోకాజ్ నోటీస్‌కు తాను తగిన సమాధానం చెబుతానన్నారు. తాను పార్టీ మారబోనని కాంగ్రెస్‌లో కొనసాగుతానన్నారు. అలాగే కాంగ్రెస్ టికెట్ ఇస్తేనే తాను మునుగోడు నుండి పోటీ చేస్తానని, ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.