నల్గొండ

టీఆర్‌ఎస్ ఆధికారంలోకి రావడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబర్ 21: ముందస్తు ఎన్నికలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పురపాలక కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపుజీ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంద్రియాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ బూర మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో చేనేత వృత్తి పూర్వవైభవం సంతరించుకుందని పేర్కొన్నారు. అధికారుల అలసత్వం వలన పిల్లాయిపల్లి కాలువ నిర్మాణం పనుల్లో జాప్యం అవుతున్నాయని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అధికారులు కాంట్రక్టులతో సమావేశం నిర్వహిస్తారని కాలువ పరిశీలిస్తామని తెలిపారు. బతుకమ్మ పండుగకు నిల్వ ఉన్న చేనేత చీరలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు, నాలుగు వరుసల జాతీయ రహదారులతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారా సరస్వతి, జడ్పీటీసీ మడుగులు ప్రభాకర్ రెడ్డి నాయకులు భూపాల్ రెడ్డి, కోట మల్లారెడ్డి, శేఖర్ రెడ్డి కొమరెల్లి లక్ష్మారెడ్డి తర్నాటి రవి, గుండు మధు, సిలువేరు బాలనరసింహా, భారత వాసుదేవ్, చిట్టిపోలు శ్రీనివాసు, కిరణ్, దశరథ, రామజనేయులు, యాదగిరి, నరసింహ, శేఖర్ పాల్గొన్నారు
ప్రజా ప్రతినిధులను అడ్డుకున్న ప్రతిపక్షాలు..
ఇంద్రియాల గ్రామంలో మూసీపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఇంద్రియాలలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిలను అడ్డుకున్నారు. గో బ్యాక్ నినాదాలతో నిరసనలు వ్యక్తం చేశారు. కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మూసీ బ్రిడ్జిపై నిర్మాణ పనులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పైళ్ల శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచిన నేటికి పనులు ప్రారంభం కాలేదని పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ప్రతిపక్ష నాయకులు వాపోయారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు త్వరలోనే జీవో తీసుకొస్తామని ఎంపీ బూర, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ప్రణయ్ చట్టం తీసుకురావాలి
* ప్రేమ వివాహాల జంటలపై దాడులు అరికట్టాలి
* ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యాద్ వలిఉల్లాఖాద్రీ
మిర్యాలగూడ, సెప్టెంబర్ 21: కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రణయ్ చట్టం తీసుకురావాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు సయ్యాద్ వలిఉల్లాఖాద్రీ, విశ్వజీకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులోన్మాద దాడుల్లో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కులాంతర ప్రేమవివాహాలు చేసుకున్న జంటలపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని వాటిని ప్రభుత్వం అరికట్టాలని కోరారు. కులోన్మాదం రోజురోజుకి పెరిగిపోతుందని, ధన, రాజకీయ పలుకుబడి కలిగిన మారుతీరావు అత్యంత పాశవికంగా సభ్యసమాజం తలదించుకోనేలా కిరాయిగుండాలచే కూతురు భర్త ప్రణయ్‌ను హత్య చేయడం హేయమైన చర్య అ న్నారు. పలుసార్లు ప్రణయ్, అమృతలు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నపించినప్పటికి వారికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని దానికి ప్రభుత్వమే బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అమృతవర్షిణి చేస్తున్న పోరాటంలో సమాజం మొత్తం మద్దతుగా నిలబడాలని వారు కోరారు. పరామర్శించిన వారిలో జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్, నాయకులు రాహుల్, అరుణ్‌గౌడ్, పరంగా రాము, లింగానాయక్, ఉదయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.