నల్గొండ

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పధకాలే గెలుపుకు బాటలు వేస్తాయని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శనివారం వేములపల్లి మండలంలోని వేములపల్లి, బుగ్గబాయిగూడెం గ్రామాల్లో విసృతంగా ప్రచారం చేపట్టారు. బుగ్గబాయిగూడెం వద్ద ఉన్న గంగమ్మ ఆలయం సందర్శించి పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకవెళ్లి రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో నిలిపానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తునట్లు తెలిపారు. తనను మరోసారి గెలిపించి అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని ప్రధమస్ధానంలో నిలుపుతానన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగాకృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు అవసరమైన ఎత్తిపోతల నిర్మాణానికి ఇప్పటికే రూ.455కోట్లను మంజూరు చేయించానని తిరిగి జనాలను గెలిపిస్తే మరిన్ని నిధులు మంజూరు చేయించి త్రాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడ దశలవారిగా పరిష్కరిస్తానన్నారు. తనను ఆధరించి రానున్న ఎన్నికల్లో గెలిపించినట్లయితే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందయని అందువల్ల రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు టిఆర్‌ఎస్ పార్టీకే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్జితో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ చిట్టిబాబునాయక్, ఎంపిపి నామిరెడ్డి నవీన కరుణాకర్‌రెడ్డి, జెడ్పిటిసి ఇరువుదిండ్ల పద్మ గోవింద్, మండల పార్టీ అధ్యక్షులు చిర్ర మల్లయ్యయాదవ్, నాయకులు నామిరెడ్డి కరుణకర్‌రెడ్డి, ప్రతాప్‌లు పాల్గొన్నారు.

మునుగోడు మిషన్ కాకతీయ అవినీతి బయటపెడతా
-బీజేపీ నేత మనోహర్‌రెడ్డి
చౌటుప్పల్, సెప్టెంబర్ 22: మునుగోడు నియోజకవర్గంలో మిషన్‌కాకతీయ పనుల్లో జరిగిన అవినీతి భాగోతాన్ని త్వరలో బయటపెడతానని, మాజీ ఎమ్మెల్యే అవినీతి చిట్టాను బహిర్గతం చేస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. చౌటుప్పల్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యేగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రభాకర్‌రెడ్డికి ప్రజలు మంచి మెజార్టీతో పట్టం కడితే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతికి పడగలెత్తారని విమర్శించారు. ప్రతి పనిలో కమీషన్‌లు తీసుకోని నిధులను స్వాహ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలుగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పైలాన్ నిర్మాణంలో జరిగిన అవినీతే నిలువెత్తు నిదర్శనమన్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తికాక ముందే పైలాన్ పగుళ్లు పట్టిందన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయన్నారు. అక్రమ వెంచర్లకు సహకరిస్తూ డబ్బులు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, పెన్షన్‌లు ఇచ్చానని చెప్పుకుంటూ నాలుగున్నరేళ్లు నెట్టుకువచ్చి మును‘గోడు’ను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలు నమ్మి మరోమారు మోసపోవద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తే మునుగోడు సమాచారాన్ని ఇవ్వడంలో వైఫల్యం చెందాడని విమర్శించారు. ప్రభుత్వ కళాశాల మంజూరైతే భూమి కేటాయించడంలో కూడా వైఫల్యం చెందాడన్నారు.