నల్గొండ

నిమజ్జనానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, సెప్టెంబర్ 22: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం చెరువును శనివారం పరిశీలించారు. వినాయకుడి విగ్రహలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై స్థానిక పోలీస్ అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుతంగా గణేష్ నిమజ్జనం జరుపుకునేందుకు ప్రజలు సహకరించాలన్నారు. దండుమల్కాపురం చెరువులో వినాయకుడి విగ్రహలను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. రోడ్డు, లైటింగ్ ఏర్పాట్లు చేసామన్నారు. అదనపు పోలీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అల్లరిమూకల నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా షీటీంలు కూడా నిఘా పెడతాయన్నారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయించినట్లు పేర్కొన్నారు. శనివారం రాచకొండ పరిధిలో తొమ్మిది వేల విగ్రహలను నిమజ్జనం చేసారని వివరించారు. నిమజ్జన శోభాయాత్రను సీసీ కెమెరాలలో రికార్డు చేస్తున్నామని, జీయోట్యాగ్ చేసామని వివరించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు సివిల్, ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
రామన్నపేట ఠాణాలో ఆకస్మిక తనిఖీ
రామన్నపేట: గణపతి నిమజ్జనం వేడుకలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ ఎం భగవత్ కోరారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం మండలంలోని ఇంద్రపాలనగరం పెద్దచెరువువద్ద గణపతి నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. లైటింగ్ సిస్టమ్, క్రేన్ సౌకర్యం వంటి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సంతోషకరంగా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం వేడుకలను నిర్వహించుకోవాలని అన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారి పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసులకు సకాలంలో సమాచారం అందించాలని ఆయన సూచించారు. ప్రజలలో అల్లర్లు సృష్టించే విధంగా ఎలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. మతసామరస్యంతో, భక్తిశ్రద్దలతో వేడుకలు జరిగే విధంగా అన్నివర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోచౌటుప్పల్ ఏసిపి బాపురెడ్డి, రామన్నపేట ఎస్‌ఐ బి.నాగన్న, మాజీ సర్పంచ్ పూస బాల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.