నల్గొండ

సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 22: ఆనాదిగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లాకేంద్రంలోని గణేష్ చౌరస్తా(పూల సెంటర్) వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో అనాదిగా పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడం వస్తున్న ఆచారమన్నారు. దేశ స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజుల్లోనూ జాతీయవాదాన్ని పెంపొందింపజేసేందుకు గణేశ్ ఉత్సవాలు దోహదం చేశాయన్నారు. దేశ ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తూ ఈ ఉత్సవాలు వందల ఏళ్లు గడిచిన నేటికి కొనసాగుతున్నాయన్నారు. ఏ ఉత్సవాలు నిర్వహించుకున్న ఆచార వ్యవహారాల ప్రకారమే జరుపుకుంటున్నామని ఈ ఉత్సవాలు ఇంకా ఐక్యతను పెంచి ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదపడాలన్నారు. వినాయకుడు ఆది దేవుడని, మనం ఏకార్యక్రమం నిర్వహించిన మొదట గణములకు అధిపతి అయిన గణనాథున్ని ప్రార్ధించి ఆకార్యం నిర్విగ్నంగా పూర్తికావాలని ఆరాధిస్తామన్నారు. వినాయకున్ని పూజించడం ప్రకృతిని పూజించడమేనన్నారు. అందువల్ల ప్రకృతి నుంచి ఎలాంటి ఆటంకం ఏర్పాడకుండా ఉండాలన్నదే మన కోరిక అన్నారు. అందువల్ల మనమంతా ప్రకృతికి భంగం కలిగించే పనులు చేపట్టకూడదన్నారు. అన్ని మతాలు, కులాల వారు కలిసి అన్ని పండుగలను జరుపుకోవడం సూర్యాపేటకు ఉన్న ప్రత్యేక గుర్తింపున్నారు. ఇక్కడ కొనసాగుతున్న ఈ సాంప్రదాయం భిన్నత్వంలో ఏకత్వనికీ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇదే పరంపరను కొనసాగిస్తూ సూర్యాపేట ఖ్యాతీని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా వినాయకునికి వాడవాడలా ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆ ఆదిదేవుడు కరుణించి సంవృద్దిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్న ప్రజలు, ఉత్సవ కమిటీల వారికి, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పనిచేసిన వివిధ శాఖల అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, భానుపురి గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అనంతుల కృపాకర్, రంగరాజు రుక్మారావు, సభ్యులు గండూరి ప్రకాశ్, గండూరి రమేష్, ఉప్పల ఆనంద్, కునుకుంట్ల శారదదేవి, కౌన్సిలర్లు తాహేర్, ఆకుల లవకుశ, గాజుల రాంబాయమ్మ, గండూరి పావని, నాయకులు పోలబోయిన నర్సయ్యయాదవ్, తూడి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనంలో ట్రాక్టర్ నడిపి ఉత్సాహపర్చిన జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 22: జిల్లాకేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సహ పర్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని గణేశ్ చౌరస్తా(పూలసెంటర్) వద్ద వేదాంత భజనమందిరం వద్ద నెలకొల్పిన విగ్రహానికి అనవాయితీ ప్రకారం పూజలుచేసి శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి ఆతర్వాత విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్‌ను స్వయంగా అక్కడ నుండి నడుపుకుంటూ కొంతదూరం వరకు తీసుకెళ్లారు. గతానికి భిన్నంగా స్వయానే మంత్రి గణేశ్ విగ్రహామున్న ట్రాక్టర్‌ను నడిపి వాహనసేవలో పాల్గొనడంతో పట్టణ ప్రజలు, భక్తులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు.

గోదావరి జలాలు సాధిస్తా: మోత్కుపల్లి
ఆలేరు, సెప్టెంబర్ 22: రానున్న రోజుల్లో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను సాధించి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని మాజీ మంత్రి, ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో కొలనుపాకలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతు తెలంగాణ రైతాంగ పోరాట వీరులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవిల స్ఫూర్తితో గోదావరి జలాల సాధనకు ఉద్యమిస్తానన్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా సాధన కోసం ఉద్యమం చేపట్టి సాధించిన ఘనత తనకే దక్కిందన్నారు. ఐదుసార్లు ఆలేరు ఎమ్మెల్యేగా, మంత్రిగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించానన్నారు. ముందస్తు ఎన్నికల్లో రాజకీయ జీవితంలో చివరి సారిగా పోటీ చేస్తున్న తనను ఆలేరు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని, ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.