క్రైమ్/లీగల్

బేతవోలులో పసికందు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరు, సెప్టెంబర్ 23: నవమాసాలు మోసి కడకు పుట్టిన పసికందును తల్లి ప్రేమ రుచిచూడక ముందే ఓ ఇంటి వెనుక వదిలివెళ్లిన సంఘటన మండలంలోని బేతవోలు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బేతవోలుకు చెందిన కందరబోయిన శ్రీను ఇంటి వెనుకాల గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా మరుగుదొడ్డి వద్ద పసికందును వదిలివెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ఇంట్లోని వ్యక్తులు పసికందును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఇంటి చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులను పిలిపించి పసికందును అప్పగించారు. కాగా విచారణ చేసి పంచనామా అనంతరం చిలుకూరు ఏ ఎస్సై పులి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. పసికందు ఉమ్మనీరు తాగడంతో ఆ నీరు తలలోకి పోయినట్లుగా వైద్యులు గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.