నల్గొండ

టీఆర్‌ఎస్ బీజేపీ ఒక్కటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 23: కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని అందువల్ల టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసినా బీజేపీకే ఓట్లు వేసినట్లు అవుతుందని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌లు అవినీతికి పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకీ నగదుఇచ్చేలా కేసీఆర్ మోదీతో ఒప్పందం చేసుకున్నారని, అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ తన అవినీతి బయట పడకుండా ఉండేందుకే మోదీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలులో మోదీ పాత్ర ఉన్నట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో మోదీ దొంగగా ప్రజల ముందు నిలబడ్డారని అన్నారు. యుద్ధ విమానాల కొనుగొలు పేరుతో రూ.36 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలను ఎందుకు వెళ్లాల్సి వస్తుందో సరైన కారణాలు చెప్పడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ చేశారని ఆరోపించారు. మంత్రి ఇంటిపై రెక్కీ పేరుతో జగదీశ్‌రెడ్డి, సంకినేనిలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రెక్కీ నిర్వహిస్తే సంకినేనిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని, అరెస్టు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సంకినేని రాజకీయ వ్యభిచారి అని, అయన జీవితమంతా అవినీతిమయమని ఆరోపించారు. ఆ ఇద్దరు నేతలు కలిసి సూర్యాపేటలోని స్థానిక నాయకులను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. జిల్లాలో 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని చెబుతూ మంత్రి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడని, సూర్యాపేటలో మంత్రి గెలిచే పరిస్థితులు లేవన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, బత్తుల రమేష్, బొక్కా ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి
* ఎంపీ బూర నర్సయ్యగౌడ్,
మోటకొండూరు, సెప్టెంబర్ 23: రాష్ణ్రముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్థి అత్యంత వేగంగా జరగాలంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ణ్ర సమితిని ప్రజలు ఆశీర్వదించాలని ఎంపీ బూరనర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మేల్యే టి సునీత అన్నారు. మండలంలోని తేరియాల గ్రామంలో తెరాస పార్టీ ముఖ్యనాయకులతో జరిగిన సమావేశంలో వారు ఆదివారం పాల్గొని మాట్లాడారు. అరవై ఎండ్లు పాలించిన గత పాలకులు తమ పార్టీని విమర్శించడం విడ్డూరమని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా తమ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకలను ప్రవేశపెట్టారని తెలిపారు.తాము ప్రజలకు చేస్తున్న మంచి పనులే వచ్చే ఎన్నికల్లో తమకు శ్రీరామరక్ష అని చెప్పారు. ఈ గ్రామంలో ఎండ్లతరబడి పెండింగ్ లో అనాంతరం పెరియాల బిటి రోడ్డు మంజూరును తమ ప్రభుత్వం చేయటం మంచి పరిణామమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయ్యని ప్రతిపక్షనేతలు ఎన్నికల కోసమే అనవసర మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.అంతకుముందు కురుమసంఘ భవనానికి ఎంపి బూర నర్సయ్య గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, ఎంపీ ఎమ్మేల్యే సమక్షంలో పార్టీ కండువా కప్పుకోని పార్టీలో చేరాలు .ఈ కార్యక్రమంలో తెరస రాష్ట్ర రైతు విభాగం ప్రాధన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి.పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల రవీందర్ రెడ్డి,ప్రాధన ఈరజాని శ్రీనివాస్ గౌడ్, ఎస్ నర్సింగ్‌యాదవ్,నాయిని రామచంద్రరెడ్డి,వెంకటేష్,బురాన్,సత్యనారాయణ,రరవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.